సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Akanksha Dubey: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న నటి..

ABN, First Publish Date - 2023-03-26T16:31:51+05:30

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే (Akanksha Dubey) మరణించారు. వారణాసిలోని సారనాథ్ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. హోటల్‌లోని గదిలో ఉరి వేసుకున్నారు. ఆకాంక్ష ‘మేరా జంగ్ మేరా ఫైస్ల’ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే (Akanksha Dubey) మరణించారు. వారణాసిలోని సారనాథ్ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. హోటల్‌లోని గదిలో ఉరి వేసుకున్నారు. ఆకాంక్ష ‘మేరా జంగ్ మేరా ఫైస్ల’ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకున్నారు. అనంతరం వరుసగా ఛాన్స్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉన్నారు. చిత్రీకరణ ముగిసిన అనంతరం హోటల్‌లోని గదిలో సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేశారు.

ఆకాంక్ష దూబే ఉత్తరప్రదేశ్‌లోని పార్సిపూర్‌కు చెందినవారు. భోజ్‌పురి ఇండస్ట్రీలో మంచి నటిగా ఆమె గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక సినిమాలు చేశారు. వీరోంకే వీర్, ఫైటర్ కింగ్ తదితర చిత్రాల్లో నటించారు. నటుడు సమర్ సింగ్ (Samar Singh)తో ఆకాంక్ష సహజీవనం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా తన ప్రేమను అధికారికంగా వెల్లడించారు. భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్‌తో ఆమె ఓ పాటను చేశారు. ఆ సాంగ్ విడుదలైన మార్చి 26నే ఆమె మరణించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-26T16:31:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!