కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పీరియాడికల్‌ పొలిటికల్‌ డ్రామా

ABN, First Publish Date - 2023-10-25T01:15:03+05:30

తిరువీర్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించే చిత్రం షూటింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రాన్ని గోపి జి. దర్శకత్వంలో రవి పనస నిర్మిస్తున్నారు...

తిరువీర్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించే చిత్రం షూటింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రాన్ని గోపి జి. దర్శకత్వంలో రవి పనస నిర్మిస్తున్నారు. తొలి షాట్‌కు నిర్మాత కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, బీఆర్‌ఎస్‌ నాయకుడు దాసోజు శ్రావణ్‌ క్లాప్‌ ఇచ్చారు. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు వేణు ఉడుగుల గౌరవ దర్శకత్వం వహించారు. ‘రొమాంటిక్‌ పీరియాడికల్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ఇది. రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా ఉంటుంది. ఒక గొప్ప సినిమాగా దీన్ని తీయాలని మా ప్రయత్నం’ అన్నారు నిర్మాత రవి పనన. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట, సంగీతం: కేపీ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, సమర్పణ: నారాయణదాస్‌ నారంగ్‌, పనస శంకరయ్య గౌడ్‌.

Updated Date - 2023-10-25T01:15:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!