Shaakuntalam: సినిమా సక్సెస్ కాలేదు కానీ.. ఆ విషయంలో మాత్రం తిరుగులేదు
ABN, First Publish Date - 2023-05-28T16:34:53+05:30
సమంత ప్రధాన పాత్రలో ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ రూపొందించిన ‘శాకుంతలం’ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం అవార్డుల పంట పండుతోంది. తాజాగా కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ‘శాకుంతలం’ చిత్రానికి నాలుగు కేటగిరీలలో అవార్డ్స్ దక్కాయి.
ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత (Samantha), దేవ్ మోహన్ (Dev Mohan) జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే విడుదలై.. అనుకున్నంతగా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఓటీటీలో ఈ చిత్రం సందడి చేస్తోంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయినప్పటికీ.. అవార్డుల విషయంలో మాత్రం తిరుగులేదనేలా దూసుకుపోతోంది. తాజాగా జరుగుతోన్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 (Cannes World Film Festival 2023)లో ఈ చిత్రం నాలుగు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుని.. తెలుగు సినిమా సత్తాని చాటింది. ఈ విషయం తెలిసి సమంత కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
‘శాకుంతలం’ సినిమా కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes World Film Festival)లో 4 కీలకమైన అవార్డులను సొంతం చేసుకున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. మరికొన్ని విజయాలు అంటూ.. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ (Best Foreign Film), బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ (Best Indian Film), బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్ (Best Fantasy Film), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (Best Costume Design)కు గానూ ‘శాకుంతలం’ చిత్రం ‘కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో అవార్డులు సొంతం చేస్తున్నట్లుగా గుణ టీమ్ వర్క్స్ (Gunaa Teamworks) సంస్థ ట్విట్టర్‌తో ప్రకటించింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది.. ఆమె కూడా అవార్డుకు అర్హురాలు అనేలా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తంగా ఈ అవార్డులతో మరోసారి ‘శాకుంతలం’ చిత్రం వార్తలలో హైలెట్ అవుతోంది.
శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు (Dil Raju) సమర్పించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ (Neelima Guna) నిర్మించారు. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కుమార్తె అల్లు అర్హ (Allu Arha) భరతుని పాత్రలో మెరిసింది. ఇంకా ఈ సినిమాలో భారీ తారాగణం నటించింది. మణిశర్మ (Mani Sharma) సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*The India House: పవర్ ఫుల్ ఫిల్మ్‌తో ఖాతా తెరుస్తోన్న ‘V మెగా పిక్చర్స్’.. మోషన్ వీడియో అదిరింది
*Sharwanand: రోడ్డు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నారంటే?
*NTR Centenary: తారక రాముని శతజయంతి - శత విశేషాలు
*LegendNTR: కత్తితో దాడి చేసిన జగ్గారావు.. ఎన్టీఆర్ చేతికి రక్తం కారుతున్నా కూడా..
*NTR Centenary Celebrations: చిరంజీవి ఇలా.. పవన్ కల్యాణ్ అలా!
*Hero Sharwanand: హీరో శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా!