సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kapil Sharma: మానసిక క్షోభను అనుభవించా.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

ABN, First Publish Date - 2023-03-12T16:35:16+05:30

కామెడీ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి కపిల్ శర్మ (Kapil Sharma). ఆయన తాజాగా నటించిన సినిమా ‘జ్విగటో’ (Zwigato). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 17న విడుదల కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామెడీ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి కపిల్ శర్మ (Kapil Sharma). ఆయన తాజాగా నటించిన సినిమా ‘జ్విగటో’ (Zwigato). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కపిల్ ఆసక్తికర సంగతులను మీడియాతో పంచుకున్నారు. తాను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపారు.

‘‘నటీ నటులకు సాధారణ జీవితం గడిపే అవకాశం ఉండదు. వారు బీచ్‌లో కూర్చోని సముద్రాన్ని చూడలేరు. రెండు గదుల అపార్ట్‌మెంట్‌లో ఎప్పుడు ఉంటారు. సాయంత్రం పూట చూసినప్పుడు చుట్టు పక్కల ఎవరు ఉండరు. బయట అంతా చీకటిగా ఉంటుంది. అటువంటి భావోద్వేగాలను మాటల్లో వర్ణించలేను. కొన్నేళ్ల క్రితం నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. మానసిక ఆరోగ్యంపై నాకు ఎటువంటి అవగాహన లేదు. నేను వచ్చిన ప్రదేశంలో దానికి సంబంధించిన చర్చలు ఎప్పుడు జరగవు. చిన్నతనంలో నేను చాలా మానసిక క్షోభకు అనుభవించాను. బాధకు గురయ్యాను. ఎవరు కూడా దానిని గుర్తించలేదు. ఆ దశను దాటిని తర్వాత మన చుట్టు ఏం జరగుతుందో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఒక నటుడు అమాయకంగా ఉన్నాడంటే తెలివితక్కువ వాడని అర్థం కాదు’’ అని కపిల్ శర్మ చెప్పారు.

కపిల్ శర్మ అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘ఫిరంగీ’, ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’, ‘ఇట్స్ మై లైఫ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా ‘జ్విగటో’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని నందితా దాస్ తెరకెక్కించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Comedian Raghu: జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్.. ఆయన జోలికేస్తే ప్రాణాలు తీస్తా..

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-12T16:37:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!