YRF: షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్లతో సినిమాటిక్ యూనివర్స్
ABN, First Publish Date - 2023-01-07T20:27:30+05:30
సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో చిత్రాలను రూపొందించడం అనేది కొత్త ట్రెండ్. ఇప్పటికే లోకేశ్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను ఈ బాటలో పయనిస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో చిత్రాలను రూపొందించడం అనేది కొత్త ట్రెండ్. ఇప్పటికే లోకేశ్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను ఈ బాటలో పయనిస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ బాటలోనే ప్రయాణిస్తూ బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలిమ్స్ సినిమాటిక్ యూనివర్స్‌ని రూపొందించనుంది. స్పై యూనివర్స్‌ని తెరకెక్కించనుంది. అందుకు సంబంధించిన లోగోను తాజాగా విడుదల చేసింది. ఈ స్పై యూనివర్స్‌లో ‘టైగర్’ (Tiger), ‘వార్’ (War) ఫ్రాంచైజీలు ఉన్నాయి. ‘పఠాన్’ (Pathaan) కూడా ఈ యూనివర్స్‌లో భాగం కానున్నట్టు తెలుస్తోంది. పఠాన్ ట్రైలర్ ఈ నెల పదిన విడుదల కానుంది. ఈ ట్రైలర్లో స్పై యూనివర్స్‌కు సంబంధించిన హింట్‌ను ప్రొడక్షన్ హౌస్ ఇచ్చే అవకాశం ఉంది. ఇండియాకు చెందిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్‌లను వెండితెరపై ఒకేసారి చూస్తే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
‘పఠాన్’, ‘టైగర్ 3’ సినిమాలతో యశ్ రాజ్ ప్రొడక్షన్స్ స్పై యూనివర్స్‌కు గట్టి పునాది వేయనున్నట్టు తెలుస్తోంది. ‘‘ ఇండియన్ సినిమాలోనే భారీగా.. స్పై యూనివర్స్‌ని రూపొందించాలని యశ్ రాజ్ ప్రొడక్షన్స్ అధినేత ఆదిత్య చోప్రా కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ యూనివర్స్‌లో ఇండియాకు చెందిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ మరికొందరు కనిపించనున్నారు. ‘పఠాన్’, ‘టైగర్’, ‘వార్’ ఫ్రాంచైజీల నుంచి వచ్చే ప్రతి చిత్రంతో ఈ సిరీస్ భారీగా, పెద్దదిగా మారుతుంది. అందువల్లే ఆది చోప్రా లోగోను లాంచ్ చేశారు. పఠాన్ ట్రైలర్‌తో పాటు ‘టైగర్’, ‘వార్’ సిరీస్‌లో వచ్చే ప్రతి సినిమాలో ఈ లోగో కనిపిస్తుంది. ఈ యూనివర్స్‌తో యశ్‌రాజ్ ప్రొడక్షన్స్‌లో రెండు ఫ్రాంచైజీలు ఉండబోతున్నాయి. గతంలో ఈ సంస్థ ‘ధూమ్’ ఫ్రాంచైజీని రూపొందించిన సంగతి తెలిసిందే’’ అని ఆదిత్య చోప్రా సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.