కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yami Goutham: ఆ విషయాలపై నాకు అవగాహన లేదు..!

ABN, First Publish Date - 2023-08-14T18:41:12+05:30

పలు వివాదాల నడుమ విడుదలై విజయబాటలో సాగుతోంది అక్షయ్‌కుమార్‌, పంకజ్‌ త్రిపాఠీ కీలక పాత్రల్లో నటించిన ‘ఓ మైడ్‌ గాడ్‌ 2’ (OMG2) చిత్రం. ఇందులో యామీగౌతమ్‌ (yami goutham) న్యాయవాదిగా కనిపించి అలరించారు. కోర్టు రూమ్‌ సీన్స్‌లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

పలు వివాదాల నడుమ విడుదలై విజయబాటలో సాగుతోంది అక్షయ్‌కుమార్‌, పంకజ్‌ త్రిపాఠీ కీలక పాత్రల్లో నటించిన ‘ఓ మైడ్‌ గాడ్‌ 2’ (OMG2) చిత్రం. ఇందులో యామీగౌతమ్‌ (yami goutham) న్యాయవాదిగా కనిపించి అలరించారు. కోర్టు రూమ్‌ సీన్స్‌లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా చెబుతున్నారు. అయితే ‘ఫిల్మ్‌మేకర్స్‌ యామీ టాలెంట్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు’ అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై యామీ గౌతమ్‌ స్పందించారు. ప్రస్తుతం మనమున్న రోజుల్లో టాలెంట్‌ కంటే మార్కెటింగ్‌కే ఇండస్ర్టీ ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. అది దురదృష్టకరం’’ అని పేర్కొంది.

‘‘కొంతమందికి ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్‌ వస్తుంది. మరికొందరికి కొన్నేళ్లు పడుతోంది. తమ ప్రతిభను మార్కెటింగ్‌ చేసుకోవడంలో కొంతమంది ముందుంటారు. తమ టాలెంట్‌ మాత్రమే మాట్లాడాలని ఇంకొంతమంది అనుకుంటారు. ఒక నటిగా కష్టపడి పని చేయడం.. మంచి స్ర్కిప్ట్స్‌ ఎంచుకోవడం.. వైవిధ్‌యమైన పాత్రలు ఎంచుకోవడం మాత్రమే నాకు తెలుసు. ప్రతిభను మార్కెటింగ్‌ చేయడంపై నాకు పెద్దగా అవగాహన లేదు. అద్భుతమైన స్ర్కిప్ట్‌, క్యారెక్టర్‌, చిత్రీకరణ కంటే మార్కెటింగ్‌పైనే చిత్రపరిశ్రమ ఆధారపడి ఉండటం దురదృష్టకరం. ఫిల్మ్‌ మేకర్స్‌ నాకు సరైన పాత్రలు ఇవ్వడం లేదని ప్రేక్షకులు అనుకోవడానికి ఇదొక కారణం కావచ్చు’’ అని చెప్పారు. ‘నువ్విలా’, గౌరవం, కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు యామీ సుపరిచితమే!

Updated Date - 2023-08-14T18:41:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!