Vivek Agnihotri: జీవితాలను నాశనం చేయడమే మీ అలవాటు.. బాలీవుడ్ దర్శకుడిపై సెటైర్లు
ABN, First Publish Date - 2023-04-06T16:58:19+05:30
‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri).
‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri). 1992లో కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాగతాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాకుండా.. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఆయన తదుపరి చిత్రం కోసం ఎంతోమంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రస్తుతం ‘ది వ్యాక్సిన్ వార్’ (The Vaccine War) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
అయితే.. వివేక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటాడు. దేశవ్యాప్తంగా జరిగిన పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar)పై వివేక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలే అనుష్క శర్మ (Anushka Sharma) గురించి కరణ్ జోహార్ మాట్లాడిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
అందులో.. ‘నిజానికి నేను మొదట అనుష్క శర్మ కెరీర్‌ని నాశనం చేద్దామనుకున్నాను. మొదటిసారి ఆదిత్య చోప్రా తన ఫొటో చూపించినప్పుడు తన హీరోయిన్ వద్దు. బాగోదు అన్నాను. కానీ.. బ్యాండ్ బాజా బారాత్ చూసిన తర్వాత తనలోని టాలెంట్ ఏంటో తెలిసింది. అప్పుడు అలా చేసినందుకు ఇప్పుడు స్వారీ చెబుతున్నా’ అని కరణ్ చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై వివేక్ అగ్నిహోత్రి తాజాగా స్పందించాడు. ‘ఎవరి కెరీర్‌ని అయినా సృష్టించడం లేదా నాశనం చేయడం కొందరికీ బాగా అలవాటు. బాలీవుడ్‌లో ఎవరైనా సెట్ అయ్యారంటే.. ప్రతిభావంతులైన బయటి వ్యక్తులను కొందరు తమ చెత్త రాజకీయాలతో తొక్కేయడం వల్లనే’ అని సెటైరికల్‌గా వివేక్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో.. ‘దాన్ని కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు వాళ్లు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని మనం ఎప్పటికీ మరవలేం’.. ‘ఎవరు స్టార్ అవ్వాలనేది కూడా కొందరు డిసైడ్ చేయడం దారుణం’.. ‘కరణ్ జోహార్‌ని చూస్తే సిగ్గేస్తుంది’ అని వరుసగా కరణ్‌ని విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
SS Rajamouli: కీరవాణిని చూసి గర్వంగా ఫీలవుతున్న రాజమౌళి.. ఈసారి ఆస్కార్ గురించి కాదులెండి..
Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..
Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?