సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamannaah -Vijay Varma: తను మాత్రమే అలా చేయగలదు.. ప్రేయసిపై పొగడ్తల వర్షం!

ABN, First Publish Date - 2023-06-22T14:35:06+05:30

విజయ్‌ వర్మ, తమన్నా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ సెట్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు. తాజాగా వీరిద్దరూ నటించిన ‘లస్ట్‌ స్టోరీస్‌2’ సిరీస్‌ ట్రైలర్‌ వచ్చింది. ఈ నెల 29న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ర్టీమింగ్‌ కానుంది. ప్రస్తుతం ఈ టీమ్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నాతో కలిసి పని చేయడం గురించి విజయ్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్‌ వర్మ (Vijay Varma)- తమన్నా (Tamanaah) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ (Lust stories 2) సెట్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు. తాజాగా వీరిద్దరూ నటించిన ‘లస్ట్‌ స్టోరీస్‌2’ సిరీస్‌ ట్రైలర్‌ వచ్చింది. ఈ నెల 29న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ర్టీమింగ్‌ కానుంది. ప్రస్తుతం ఈ టీమ్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నాతో కలిసి పని చేయడం గురించి విజయ్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో పాత్రకు తమన్నా మాత్రమే సరిపోతుందని.. పొగడ్తల వర్షం కురిపించారు. (love birds)

‘‘కథ వినగానే హీరోయిన్‌ ఎవరని అడిగాను. దర్శకుడు తమన్నా అనగానే పర్ఫెక్ట్‌ సెలక్షన్‌ అనిపించింది. షూటింగ్‌ పూర్తయ్యాక నిజంగా ఆమె ఆ పాత్రకు కరెక్ట్‌గా సరిపోయింది. పాత్రకు గ్లామర్‌తోపాటు, హుందాతనం తెప్పించింది. తను అంగీకరించిన ప్రతి పాత్ర లోతుగా పరిశీలిస్తుంది. డెడికేటింగ్‌గా పని చేస్తుంది. తన మాత్రమే అలా చేయగలదు. మన తోటి నటీనటులు ఉత్సాహంగా ఉన్నప్పుడు సెట్‌లో పని సరదాగా గడిచిపోతుంది. తను నటించిన ‘బాహుబలి’ని థియేటర్లో చూశా. ఈ మధ్యనే ‘బబ్లీ బౌన్సర్‌’ను చూశాను ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. ‘లస్ట్‌ స్టోరీస్‌-2 చూసి ప్రేక్షకులు, అభిమానలు తన నటనను ప్రశంసిస్తారు. తమన్నా ఓ ఐకాన్‌గా గుర్తింపు పొందుతుంది’’ అని అన్నారు.

తమన్నా బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్‌’లో నటిస్తోంది. మెహర్‌ రమేశ్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

Updated Date - 2023-06-22T15:22:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!