సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijay Sethupathi : షారుక్‌ కోసమే చేశా... అభిమానాన్ని చాటుకున్న నటుడు!

ABN, First Publish Date - 2023-07-16T18:12:16+05:30

ఉప్పెన’ చిత్రంలో రాయణం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు విజయ్‌ సేతుపతి. అప్పటి నుంచి కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ నటుడిగా బిజీ అయ్యారు. హీరోగానే కాకుండా విభిన్న పాత్రలతో అలరిస్తున్న ఆయన ‘ముంబైకర్‌’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ప్రస్తుతం షారుక్‌ఖాన్‌ ‘జవాన్‌’లో విలన్‌గా నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఉప్పెన’ (Uppena) చిత్రంలో రాయణం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు విజయ్‌ సేతుపతి (Vijay Setupathi). అప్పటి నుంచి కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ నటుడిగా బిజీ అయ్యారు. హీరోగానే కాకుండా విభిన్న పాత్రలతో అలరిస్తున్న ఆయన ‘ముంబైకర్‌’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ప్రస్తుతం షారుక్‌ఖాన్‌ ‘జవాన్‌’(Jawan) లో విలన్‌గా నటించారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం చేయడానికి కారణం గురించి విజయ్‌ సేతుపతి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘కేవలం షారుక్‌ ఖాన్‌ కోసమే (Shah Rukh khan) ఈ సినిమాలో నటిస్తున్నా. ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా ఆయనతో కలిసి నటించేవాణ్ని’’ అంటూ షారుక్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. 2019లో వచ్చిన ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాలోని విజయ్‌ సేతుపతి నటన చూసి షారుక్‌ అభినందించిన విషయం తెలిసిందే! దాంతో కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని సినీ ప్రియులు సోషల్‌ మీడియా వేదికగా తమ కోరికను వెల్లడించారు. జవాన్‌ చిత్రంతో అట్లీ ఆ కోరికను తీర్చారు. సమాజంలో జరుగుతున్న తప్పులను సరిదిద్దడానికి సిద్థంగా ఉన్న ఓ వ్యక్తి ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె అతిథిగా మెరవనున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-07-17T09:38:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!