Vidyut Jammwal: ఒంటిపై నూలు పోగు లేకుండా అడవుల్లో హల్చల్.. ఏమైంది సామీ వీళ్లకి
ABN, First Publish Date - 2023-12-10T15:52:34+05:30
పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అచ్చం అలానే ఉంది ఈ బాలీవుడ్ నటుడు విద్యుత్ దేవ్ సింగ్ జమ్వాల్ వ్యవహారం. చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ దేశవ్యాప్తంగా అభిమానులను, పేరును సంపాదించుకున్న ఇతను ఇప్పుడు ఒక్కసారిగా న్యూడ్‌గా దర్శనం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.
పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అచ్చం అలానే ఉంది ఈ బాలీవుడ్ నటుడు విద్యుత్ దేవ్ సింగ్ జమ్వాల్(Vidyut Jammwal ) వ్యవహారం. చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ దేశవ్యాప్తంగా అభిమానులను, పేరును సంపాదించుకున్న ఇతను ఇప్పుడు ఒక్కసారిగా న్యూడ్‌గా దర్శనం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఒంటిపై నూలు పోగు లేకుండా హిమాలయాల్లోని నీళ్లలో ఈత కొట్టుకుంటూ, వంట చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. అయితే ఆమధ్య బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ (Ranveer Singh), తమిళ హీరో గుత్తా జ్వాల భర్త విష్ణు విశాల్(Vishnu Vishal) న్యూడ్‌గా ఫొటో షూట్స్ చేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు విద్యుత్ జమ్వాల్ ఫొటోలు అంతకుమించి అనేలా ఉన్నాయి.
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన జమ్వాల్ మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు కూడా. మూడేండ్ల వయస్సు నుంచే మార్షల్ ఆర్ట్స్, కలరిపయట్టు వంటి వాటిలో శిక్షణ తీసుకుని దాదాపు 25 దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ఆవార్డులు గెలుచుకున్నాడు. 2011లో తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర పోషించడం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ నటుడు ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెళ్లి సినిమాలోనూ విలన్‌గా నటించాడు. అటు తర్వాత తమిళంలో వచ్చిన తుపాకీ సినిమాలో విలన్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
2011లోనే జాన్ అబ్రహం హీరోగా నటించిన ఫోర్స్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి కమాండో1, 2 చిత్రాలతో జాతీయ స్థాయిలో ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. ఆదే క్రమంలో మరో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారాడు. జమ్వాల్ (Vidyut Jammwal) సినిమా రంగంలోకి వచ్చి 12 యేండ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయన చేసిన సినిమాలు 20 మాత్రమే. చివరగా తెలుగు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం ఐబీ 71 చిత్రంలో నటించడమే కాక నిర్మాణం కూడా చేశాడు.
అయితే ప్రకృతిని వీపరీతంగా ప్రేమించే జమ్వాల్ దేశంలోనే బెస్ట్ ఫిట్నెస్ బాడీ,హెల్త్ ఉన్న వ్యక్తిగానే కాకుండా వేగన్ (శాఖహరి)గా ఉన్న అతి కొద్దిమంది సెలబ్రిటీలలో ఆగ్ర భాగాన ఉన్నాడు. ఏ కొద్దిపాటి సమయం దొరికినా హిమాలయాల్లోకి గానీ, ఆడవుల్లోకి వెళ్లి ఒంటరిగానే గడిపేస్తూ ఉంటాడు. బురదలో గంటల కొద్దీ ఉంటూ ద్యానం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే రీసెంట్గా హిమాలయాలకు వెళ్లిన జమ్వాల్ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ వంటిపై నూలు పోగు లేకుండానే తన దైనందిన కార్యకలాపాలన్నీ ఒక్కడే చేసుకుంటూ వారం పైనే గడిపాడు.
అదే విషయాన్ని ‘హిమాలయాలకు తిరిగి వెళ్లిపోయాను.14 సంవత్సరాల క్రితం ఆరంభించిన ఈ పర్యటనలో నాకు తెలియకుండానే వారం, పది రోజులు ఇక్కడ ఒంటరిగా గడపడం నా జీవితంలో అంతర్బాగంమైందని నాలో ఇది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందంటూ’ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టగా అది బాగా వైరల్ అవుతున్నది. ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి చిత్రం క్రాక్ గురించి వివరాలు వెళ్లడించాడు.