Vivek Agnihotri: బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-04-05T17:26:20+05:30
‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) కు దర్శకత్వం వహించి ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri). గతంలో అనేక సార్లు బాలీవుడ్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) కు దర్శకత్వం వహించి ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri). గతంలో అనేక సార్లు బాలీవుడ్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీ టౌన్ సినిమాలు ఘోరమైన దశలో ఉన్నాయని తెలిపారు.
బాలీవుడ్‌లో ఈ మధ్య విడుదలైన అన్ని చిత్రాలు పరాజయాన్ని చవి చూస్తున్నాయి. భోలా, షెహజాదా, తూ ఝూఠీ మై మక్కర్ వంటి సినిమాలు కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేక పోయాయి. షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ (Pathaan) మాత్రమే బీ టౌన్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ అంశాలన్నింటిని వివరిస్తూ ప్రముఖ వెబ్‌సైట్‌లో కథనం వచ్చింది. ఈ కథనానికి వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘బాలీవుడ్ ఘోరమైన దశను ఎదుర్కొంటుంది. మినిమం ఓపెనింగ్ కూడా గ్యారంటీ ఇవ్వలేని హీరోలకు ఇండస్ట్రీ మొత్తం భారీ స్థాయిలో రెమ్యునరేషన్స్ ఇస్తుంది. డబ్బులో అత్యధిక శాతం వ్యానిటీ, స్టార్స్ లైఫ్‌స్టైల్‌కే ఖర్చయిపోతుంది. తప్పు ఎక్కడ జరుగుతుంది..?’’ అని వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యనించారు.
కొన్ని రోజుల క్రితం పఠాన్ సినిమాపై వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ‘బే షరమ్ రంగ్’ పాటను మొదట ఆయన తీవ్రంగా విమర్శించారు. అనంతరం మూవీ సంచలన విజయంపై కూడా మాట్లాడారు. ‘‘షారూఖ్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్‌డమ్ వల్లే పఠాన్ సినిమా భారీ విజయం అందుకుంది. మూవీ భారాన్ని మొత్తం షారూఖ్ తన భుజాలపై మోశారు. అద్భుతంగా మార్కెటింగ్ చేశారు. ‘పఠాన్’ పై నిరసన వ్యక్తం చేసి, బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చి ప్రచారం కల్పించిన వారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి’’ అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?
Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36
Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..
Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..
Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?