సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamannaah Bhatia: అసహ్యించుకున్నారు కానీ.. కలిసొచ్చింది

ABN, First Publish Date - 2023-07-06T13:42:35+05:30

టాలీవుట్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ తమన్నా. అందుకు రెండు కారణాలు రెండు. ఒకటి.. తాను ప్రేమలో ఉన్నానంటూ ప్రియుడి గురించి వెల్లడించడం, రెండోది ఈ మధ్యకాలంలో నటించిన రెండు వెబ్‌ సిరీస్‌లు. తాజాగా తమన్నా నటించిన ‘జీ కర్దా’, లస్ట్‌ స్టోరీస్‌-2’ సిరీస్‌లు ఓటీటీల్లో హల్‌చల్‌ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుట్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ తమన్నా(Tamannaah Bhatia) . అందుకు రెండు కారణాలు రెండు. ఒకటి.. తాను ప్రేమలో ఉన్నానంటూ ప్రియుడి గురించి వెల్లడించడం, రెండోది ఈ మధ్య కాలంలో నటించిన రెండు వెబ్‌ సిరీస్‌లు. తాజాగా తమన్నా నటించిన ‘జీ కర్దా’, (లస్ట్‌ స్టోరీస్‌-2’ (lust stories2) సిరీస్‌లు ఓటీటీల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ రెండు సిరీస్‌ల్లోనూ తమన్నా మునుపెన్నడూ చేయనంత బోల్డ్‌గా నటించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌. గతంలో తమన్నా గ్లామర్‌ పాత్రలు పోషించినా ఎక్కడా హద్దులు మీరలేదు. ఈ రెండు సిరీస్‌ల్లోనూ శృంగార సన్నివేశాల్లో (Tamannah bold charectors) శృతిమిచి బోల్డ్‌గా కనిపించింది. తనలో బోల్డ్‌ నెస్‌ ఏ స్థాయిలో ఉంటుందో ‘జీ కర్దా’, ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ సిరీస్‌లతో నిరూపించింది ఈ సిరీస్‌ కోసం మొదటిసారి లిప్‌ లాక్‌ (liplock) సన్నివేశాల్లోనూ నటించింది. తమన్నా ఇంత హాట్‌గా కనిపిస్తుందని ఎవరూ ఊహించలేదు. దాంతో మిల్కీబ్యూటీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెను అభిమానించే వాళ్లు అసహ్యించుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ‘తమన్నా నువ్వేనా ఇలాంటి పాత్ర చేసింది? ఇంత దిగజారిపోయావేంటి? డబ్బు కోసమేనా ఇదంతా? అని కామెంట్లు చేశారు. ఇకపై ఆమెకు అవకాశాల రావని ట్రోల్‌ చేశారు. (Two more Offers)

అయితే ఇదంతా తమన్నాకు ప్లస్‌ అయినట్లే కనిపిస్తోంది. తన హాట్‌నెస్‌ ఆమెకు మరిన్ని ఆఫర్లు తెచ్చి పెడుతోంది. ప్రస్తుతం తమన్నా హాట్‌ స్టార్‌ కోసం మరో రెండు వెబ్‌ సిరీస్‌లు చేయనుందట. దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌ కూడా పూర్తయిందని బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. తాజాగా ఆమె చేసిన బోల్డ్‌ పాత్రలే ఈ అవకాశాలు తెచ్చిపెట్టిందని వినికిడి. ఓటీటీలో ఎలాంటి కంటెంట్‌ అయినా నడుస్తోంది. దానికంటూ ఓ ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంది. సో ఇలాంటి సిరీస్‌లకు ఎంత నెగటివ్‌ టాక్‌ వచ్చినా... ప్లస్సే అవుతుందని తాజా సిరీస్‌లు నిరూపించాయి. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవి సరసర ‘భోళా శంకర్‌’, తమిళంలో రజనీకాంత్‌ సరసన ‘జైలర్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

Updated Date - 2023-07-06T13:42:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!