Taapsee : కొత్త ప్రయత్నాలు చేయరు.. నాలాంటి వాళ్ల చేస్తే సపోర్ట్ తక్కువ
ABN, First Publish Date - 2023-10-13T17:06:23+05:30
ఝుమ్మంది నాదం చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు తాప్సీ(Taapsee) . తెలుగులో వరుసగా అవకాశాలు అందుకున్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది. అక్కడ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని గుర్తింపు దక్కించుకుంది.
ఝుమ్మంది నాదం చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు తాప్సీ(Taapsee) . తెలుగులో వరుసగా అవకాశాలు అందుకున్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది. అక్కడ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని గుర్తింపు దక్కించుకుంది. తాజాగా 'ధక్ ధక్ 'చిత్రంతో నిర్మాతగా కూడా మారారు. వివాదాలకు దగ్గరగా ఉండే తాప్సీ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ "సినిమాకు కథే ముఖ్యమని మేకర్స్ చెబుతుంటారు. అది నిజం కాదు. కథ ఒక్కలైన్ చెప్పగానే వెంటనే ‘హీరో ఎవరు’ అని అందరూ అడుగుతారు. సినిమాకు కథే ముఖ్యం అనేది నేను నిర్మాతగా మారగానే చెదిరిపోయింది. కథ ఒక్కలైన్ వినగానే హీరో గురించి అడుగుతారు. నేను హీరోయిన్‌గా సినిమాలు చేసినప్పుడు నా సహనటుడు ఎవరు? నిర్మాతలు ఎవరు? అని ఎప్పుడూ అడగలేదు. చాలా మంది కొత్త దర్శకులతో పనిచేశాను. అలాగే కొందరు హీరోల తొలి సినిమాల్లోనూ నేను నటించాను. అప్పట్లో నేనిలా ఎవరినీ అడగలేదు’ అని అన్నారు.
ఓటీటీలపై కూడా తాప్సీ కామెంట్ చేశారు. ఓటీటీ అభివృద్ధి చెందాక పెద్ద నిర్మాణ సంస్థలు ఉనికి కోల్పోతున్నాయి. చిన్న సినిమాల డిజిటల్ హక్కులను విడుదలకు ముందే తక్కువ ధరలకే పొందుతున్నారు. దీని వల్ల ఆ సినిమాలను విడుదల చేయడానికి కనీస ఆసక్తి కూడా ఉండట్లేదు. అది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్ద ప్రాజెక్టు?కు మాత్రమే కావాల్సినంత ప్రచారం చేస్తారు. అలాంటప్పుడు చిన్న సినిమాలకు సక్సెస్ ఎలా వస్తుంది. దాంతో హీరోల మధ్య ఎంతో గ్యాప్ పెరిగిపోతుంది. బాలీవుడ్ అర్థవంతమైన, కొత్త వాటిని ప్రయత్నించదు. ఒకవేళ నాలాంటి వాళ్లు అలా ప్రయత్నించినా మద్దతు లభించదు. ఎవరో అరుదుగా మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధానం మారాలి’’ అని తాప్సీ అన్నారు. ప్రస్తుతం తాప్సీ వ్యాఖ్యలు బాలీవుడ్ దుమారం రేపుతున్నాయి.