సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Swara Bhasker: రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్

ABN, First Publish Date - 2023-02-16T18:57:11+05:30

మాటలను తూటల్లా సంధించే బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhasker). సమకాలీన అంశాలు, రాజకీయాలపై తరచుగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ‘తను వెడ్స్ మను’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో ఫేమ్‌ను సంపాదించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాటలను తూటల్లా సంధించే బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhasker). సమకాలీన అంశాలు, రాజకీయాలపై తరచుగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ‘తను వెడ్స్ మను’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో ఫేమ్‌ను సంపాదించుకున్నారు. స్వర తాజాగా సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) (Samajwadi Party) రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆమె జనవరిలోనే పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ విషయాన్ని తాజాగానే వెల్లడించారు.

ఎస్పీ నాయకుడు ఫహద్ అహ్మద్ (Fahad Ahmad)తో కలసి స్వర భాస్కర్ ఏడడుగులు వేశారు. ప్రత్యేక వివాహ చట్టం కింద జనవరి 6న ఈ పెళ్లిని కోర్టులో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వివాహనికి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘‘పక్కనే వ్యక్తి ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీరు ఈ విశాల ప్రపంచంలో వెతుకుతుంటారు. ప్రేమ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ, మేం మొదట స్నేహితులుగా ప్రయాణాన్ని ప్రారంభించాం. అనంతరం ఒకరి ప్రేమలో మరొకరం పడిపోయాం. నా హృదయంలోకి ఫహద్‌కు స్వాగతం’’ అని స్వర భాస్కర్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. స్వర, ఫహ‌ద్‌కు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకున్నారు. ఫహద్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ యూత్ వింగ్‌ మహారాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం అందుతుంది.

Updated Date - 2023-02-16T19:00:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!