సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pregnant: పెళ్లయి 3 నెలలు.. అక్టోబర్‌లో బేబీ అంటూ నటి చేసిన పోస్ట్ వైరల్

ABN, First Publish Date - 2023-06-06T16:54:31+05:30

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పెళ్లయిన మూడు నెలల తర్వాత తన ప్రెగ్నెంట్ అని వెల్లడించింది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలుపుతూ.. సోషల్ మీడియాలో బేబీ బంప్‌తో తన భర్త ఒడిలో కూర్చుని ఉన్న ఫొటోని షేర్ చేసింది. అంతేకాదు అక్టోబర్‌లో బేబీ అంటూ తను బేబీకి జన్మనిచ్చే తేదీని కూడా వెల్లడించింది. ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Swara Bhaskar announced her pregnancy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ హీరోయిన్‌కి పెళ్లయి మూడు నెలలు. ఆ పెళ్లి విషయంలో కూడా ఆమె హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడేమో బేబీ బంప్‌తో దర్శనమిచ్చి.. అక్టోబర్‌లో బేబీ అంటోంది. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ (Swara Bhasker). తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు నెలల క్రితం స్వరా భాస్కర్.. సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ జిరార్ అహ్మద్‌ (Fahad Zirar Ahmed)ను ముందు రిజిస్టర్ మ్యారేజ్.. ఆ తర్వాత నార్మల్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి సమయంలో కూడా స్వరా భాస్కర్‌పై ఓ రేంజ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో బేబీ బంప్‌ (Baby Bump)తో దర్శనమివ్వడంతో మరోసారి ఆమె వార్తలలో హైలెట్ అవుతోంది.

పెళ్లయిన మూడు నెలలు తర్వాత బేబీ బంప్‌తో ఉన్న ఫొటోని స్వరా భాస్కర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘కొన్నిసార్లు భగవంతుడు మన ప్రార్థనలని ఆలకించి ఫలించేలా చేస్తాడు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ఏదో తెలియని గొప్ప అనుభూతితో పాటు చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాం’’ అని తన భర్త ఒడిలో కూర్చుని ఉన్న ఫొటోని స్వరా భాస్కర్ షేర్ చేసింది. అంతేకాదు.. ట్యాగ్స్‌లో అక్టోబర్‌‌బేబీ (#Octoberbaby) అంటూ ఆమె తెలపడంతో.. మూడు నెలల క్రితమే పెళ్లి.. ఇప్పుడు ప్రెగ్నెంట్.. అక్టోబర్‌లో బేబీ అంటోంది ఏంటి అంటూ నెటిజన్లు లెక్కలేస్తున్నారు.

స్వరా భాస్కర్ విషయానికి వస్తే.. 2009లో ‘మధోలాల్ కీప్ వాకింగ్’ (Madholal Keep Walking) సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన స్వరా భాస్కర్.. ‘తను వెడ్స్ మను’ (Tanu Weds Manu)లో చేసిన పాత్రతో మంచి గుర్తింపును పొందింది. ఆ తర్వాత బాలీవుడ్ దాదాపు 20 సినిమాలలో ఆమె నటించింది. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ జిరార్ అహ్మద్‌‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడా బంధం ఇంకో మెట్టు ఎక్కి.. వారిద్దరూ తల్లిదండ్రులయ్యే వరకు చేరింది. ప్రస్తుతం బేబీ బంప్‌తో ఉన్న ఫొటోని షేర్ చేసి.. తను తల్లికాబోతున్న విషయాన్ని తన అభిమానులకు తెలియజేసింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*NBK108: బాలయ్య బర్త్‌డే‌కి ట్రీట్ అదిరిపోనుంది

*Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ కోసం భారీగా.. ‘సెట్’ చేస్తున్నారు

*Akhil Agent: ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

*Actor Prabhu: నాన్నకు తొలి వీరాభిమాని ఆయనే..

*Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ఫిక్సయింది

*Eega 2: రాజమౌళి ‘ఈగ’ మళ్లీ ఎగురుతుందా?

Updated Date - 2023-06-06T16:54:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!