Sushmita Sen: ఇది నా జీవితం.. నా వ్యక్తిగతం!
ABN, First Publish Date - 2023-08-05T20:12:36+05:30
గత ఏడాది హార్ట్ఎటాక్కు గురై సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డ మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ (Sushmita Sen) కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆమె ‘తాళి’ (taali) అనే సిరీస్‌తో బుల్లితెరపై సందడి చేయనున్నారు.
గత ఏడాది హార్ట్ఎటాక్కు గురై సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డ మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ (Sushmita Sen) కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆమె ‘తాళి’ (taali) అనే సిరీస్‌తో బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తోపాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై మాట్లాడారు. ‘తాళి’ సిరీస్ ఫస్ట్ లుక్ విడుదలైన సమయంలో చేసిన కామెంట్ల గురించి స్పందించారు. ‘‘సామాజిక కార్యకర్త, ట్రాన్స్‌జెండర్ శ్రీగౌరి సావంత్ జీవితం ఆధారంగా ‘తాళి’ సిరీస్ తీశాం. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు పేరు లేని కొందరు నెటిజన్లు నన్ను కామెంట్ చేశారు. అసభ్యంగా మాట్లాడటం చూసి షాక్ అయ్యా. ఇలా ఎలా కామెంట్ చేయగలుగుతున్నారు అనిపించింది’’ అని సుస్మిత అన్నారు. అలాగే లలిత్ మోదీతో (lalit modi)తాను రిలేషన్లో ఉన్నానంటూ వచ్చినప్పటి వార్తలపై ఆమె స్పందించారు. ఆ సమయంలో కొందరు టార్గెట్ చేసి విమర్శించారన్నారు. కొందరైతే ‘గోల్డ్ డిగ్గర్’ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు.
‘‘ఇది నా జీవితం. బయట వ్యక్తులకు చెప్పాల్సిన పనిలేదు. ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఆ విమర్శలు నా వరకూ రావడం మంచిదే. ‘గోల్డ్ డిగ్గర్’ అంటే నిజమైన అర్థమేమిటో తెలుసుకోగలను. మిమ్మల్ని ప్రభావితం చేసేలా విమర్శలకు అనుమతిస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ నేను అలా చేయలేదు. అలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే, ఇది నా జీవితం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు అందరితో చెప్పాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు. ప్రస్తుతం తాను ఎవరితోనూ రిలేషన్లో లేనని.. సింగిల్‌గానే ఉన్నానన్నారు. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీపై సరైన సమయం చూసి స్పందిస్తా. లేదంటే ఊరుకుంటా’’ అని సుస్మితా సేన్ అన్నారు.
సుస్మితాసేన్‌తో డేటింగ్లో ఉన్నానంటూ, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటానని లలిత్ మోదీ కొంతకాలం క్రితం ట్వీట్ చేయగా అది ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! దీంతో పలువురు నెటిజన్లు సుస్మితను తీవ్రంగా విమర్శించారు. డబ్బు కోసమే ఆమె లలిత్‌ను ప్రేమిస్తుందని కామెంట్ చేశారు. విపరీతంగా ట్రోల్ జరగడంతో లలిత్ ఆ ట్వీట్ డిలీట్ చేశారు.