కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dunki: ఇండియాలో.. రూ.100 కోట్ల‌ను దాటిన షారూక్ ఖాన్ ‘డంకీ’

ABN, Publish Date - Dec 26 , 2023 | 10:36 PM

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ రాజ్‌కుమార్ హిరాని కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు లేకుండా ఫీల్ గుడ్ ఎంటర్ టైనింగ్, ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇండియాలోనే కాదు.. ఓవ‌ర్‌సీస్‌ లోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

dunki

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ (Shah Rukh Khan) , సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’(Dunki). క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను హృదయాలను డంకీ (Dunki) చిత్రం గెలుచుకుంటోంది. ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు లేకుండా ఫీల్ గుడ్ ఎంటర్ టైనింగ్, ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం అత్యద్భుతమైన స్పందనను రాబట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఇండియాలోనే కాదు.. ఓవ‌ర్‌సీస్‌లోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అక్క‌డి ప్రేక్ష‌కులు సినిమా కాన్సెప్ట్‌కు బాగా క‌నెక్ట్ అవుతున్నారు.

సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లోనే డంకీ (Dunki) సినిమా ఇండియాలో రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించ‌టం విశేషం. ప‌ఠాన్‌, జ‌వాన్ సినిమాల త‌ర్వాత షారూక్ ఖాన్ (Shah Rukh Khan) న‌టించిన డంకీ సినిమా రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఒకే ఏడాదిలో ఒకే హీరో ఈ క్రెడిట్‌ను సాధించ‌టం ఓ విశేషం. ఆదివారం రోజు ఈ చిత్రానికి రూ.29.25 కోట్ల నుంచి రూ.30.25 కోట్ల క‌లెక్ష‌న్స్ వచ్చాయి. దీంతో మొత్తం వ‌సూళ్లు రూ.102.50 కోట్ల‌కు చేరుకుంది. ముంబై, డిల్లీ, కోల్‌క‌త్తా, బెంగ‌ళూరు వంటి మ‌హా న‌గ‌రాల్లోని మ‌ల్టీప్లెక్స్ థియేర్స్‌లో డంకీ (Dunki) సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.


షారూక్ ఖాన్ (Shah Rukh Khan) విషయానికి వ‌స్తే ఆయ‌న కెరీర్‌లో రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన ప‌దో సినిమా డంకీ (Dunki). రోజు రోజుకీ ఈ సినిమాకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. అందుకు ఉదాహ‌ర‌ణ ఆదివారం రోజు క‌లెక్ష‌న్స్ 25 శాతం పెర‌గ‌ట‌మేన‌ని అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు.‘డంకీ’ (Dunki) చిత్రంలో బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ (Shah Rukh Khan) ప్రేక్షకులను మెప్పించారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి (Rajkumar Hirani) ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లుగా వ‌ర్క్ చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 10:36 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!