సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rohit Shetty: షూటింగ్‌లో గాయపడిన స్టార్ డైరెక్టర్

ABN, First Publish Date - 2023-01-07T15:01:56+05:30

‘సింగం’ (Singam) ప్రాంచైజీతో ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty). బాలీవుడ్‌లోని ఫేమస్ డైరెక్టర్స్‌లో ఒకరు. రోహిత్ ఓ వెబ్‌సిరీస్‌‌కు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘సింగం’ (Singam) ప్రాంచైజీతో ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty). బాలీవుడ్‌లోని ఫేమస్ డైరెక్టర్స్‌లో ఒకరు. రోహిత్ ఓ వెబ్‌సిరీస్‌‌కు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ (Indian Police Force) టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ షో షూటింగ్‌లో అతడు గాయపడ్డాడు. కార్ ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా చేతికి గాయాలయ్యాయి. దీంతో ప్రొడక్షన్ టీమ్ సత్వరమే స్పందించి కామినేని హాస్పిటల్స్‌కు తరలించింది. చికిత్సను అందించింది. వైద్యుల బృందం చిన్నపాటి సర్జరీ చేశారని తెలుస్తోంది. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.

యాక్షన్‌ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని రోహిత్ శెట్టికి పేరుంది. అదే బాటలో నడుస్తూ ఇండియన్ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ ను తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా రూపొందిస్తున్నాడు. సిద్దార్థ్ మల్హోత్రా, శిల్పాశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌ వీడియో, రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌ నిర్మిస్తున్నాయి. దేశానికి నిస్వార్థంగా సేవలను అందించిన పోలీసుల ధైర్య సాహసాలను ఆధారం చేసుకుని ఈ వెబ్‌‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ షో 8 ఎపిసోడ్స్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక రోహిత్ శెట్టి కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ‘సర్కస్’ కు దర్శకత్వం వహించాడు. తొలిసారిగా కామెడీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. నిర్మాతలతో సహా డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాలను మిగిల్చింది. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌గా నటించారు.

Updated Date - 2023-01-07T15:01:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!