సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tips to Healthy hair: ఖర్చు లేకుండా అందమైన కురులు కావాలా.. సలహాలు ఇచ్చిన ‘సాహో’ భామ..

ABN, First Publish Date - 2023-02-19T11:32:23+05:30

శ్రద్ధాకపూర్‌ (Shraddha Kapoor)... ‘సాహో’ (Saaho)తో తెలుగు తెరకు పరిచయమై... తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

Shraddha Kapoor
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రద్ధాకపూర్‌ (Shraddha Kapoor)... ‘సాహో’ (Saaho)తో తెలుగు తెరకు పరిచయమై... తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. బాలీవుడ్‌ (Bollywood) టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలుగుతోంది. ‘క్రీమ్స్‌, ఫేస్‌ప్యాక్స్‌ వద్దు... ఇంటి చిట్కాలే ముద్దు’ అంటూ తన స్కిన్‌కేర్‌, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ను బయటపెట్టిందీ బాలీవుడ్‌ భామ. ఇంతకీ ఆ చిట్కాలేమిటంటే...

ఇంట్లోనే హెయిర్‌ మాస్క్‌ (Hair Mask)..

పొడవైన, ఆరోగ్యకరమైన కురులంటే ఎవరికి ఇష్టం ఉండదు? కాకపోతే డబ్బులు ఖర్చు పెట్టి మరీ హెయిర్‌ మాస్క్స్‌ అంటూ పార్లర్‌ల చుట్టూ తిరుగుతుంటారు చాలామంది. కానీ నేను మాత్రం ఇంట్లో, పెరట్లో లభించే కలబంద గుజ్జు, మందార ఆకులు లేదా పువ్వులు, కాస్త పెరుగుతో చేసిన మిశ్రమాన్ని తలకు రాస్తుంటాను. కలబందలో ఉండే విటమిన్‌ ఏ, సీ, ఈ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఫలితంగా కేశాలు మెరుస్తూ, మృదువుగా మారతాయి. మందారంలో ఉండే విటమిన్‌ సీ, అమైనో ఆమ్లాలు స్కాల్ప్‌కు రక్త సరఫరా సరిగ్గా జరిగేటట్లు చేస్తాయి. పెరుగులో ఉన్న లాక్టిక్‌ ఆమ్లాలు చనిపోయిన చర్మకణాలను శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు కావల్సిన ప్రోటీన్‌ను అందిస్తాయి.

ఇది కూడా చదవండి: Anushka Shetty: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్వీటీ.. మొదలుపెడితే 20 నిమిషాలపాటు నాన్‌స్టాప్‌గా..

ట్రైనర్‌ సాయంతో టెర్రస్‌పై..

కరోనా సమయంలో జిమ్‌లు అన్నీ మూతబడ్డాయి. అయినా నేను మాత్రం నా వర్కవుట్స్‌ని పక్కన పెట్టేయలేదు. వీడియో కాల్‌ ద్వారా నా ట్రైనర్‌ నాకు వివిధ రకాల వర్కవుట్స్‌ నేర్పించేవారు. అవన్నీ నాకు నేను టెర్రస్‌పై ప్రాక్టీస్‌ చేసేదాన్ని. అది నా లైఫ్‌లో ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఇప్పటికీ సమయం చిక్కితే జిమ్‌లో సాధన చేస్తూ ఉంటాను. ఫిట్‌నెస్‌ విషయంలో నేను పర్‌ఫెక్ట్‌.

మసాజ్‌తో మేలు..

షూటింగ్‌ల కోసం ఆ దేశం, ఈ దేశం అంటూ తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా జుట్టు చిగుర్లు బాగా పగిలిపోతుంటాయి. ఈ సమస్యను నివారించేందుకు చిన్న టిప్‌ను ఫాలో అవుతా. అదేంటంటే.. నూనెను కాస్త వేడిచేసి, అది చల్లారాక జుట్టుకు బాగా పట్టించి మునివేళ్లతో కాసేపు మసాజ్‌ చేసుకుంటా. ఇది స్కాల్ప్‌కు రక్త ప్రసరణ బాగా జరగడానికి సహాయపడుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యకరంగా ఉండడంతో పాటు మెరుస్తుంది. ఈ మసాజ్‌ నా హెయిర్‌కేర్‌ రొటీన్‌లో చాలా ముఖ్యమైనది.

మాయిశ్చరైజర్‌ తప్పనిసరి..

నాది చాలా మృదువైన చర్మం. అందుకే నేను రోజుకు రెండుసార్లు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్‌ అప్లై చేస్తాను. దీనివల్ల ముఖం పొడిబారకుండా ఉండడంతో పాటూ ఆరోగ్యంగా ఉంటుంది. ఫేస్‌ మాస్క్స్‌, స్క్రబ్స్‌ వంటివి వాడడం కంటే మాయిశ్చరైజర్‌ రాసి ముఖాన్ని అలా వదిలేయడమే ఉత్తమం.

డ్యాన్స్‌ చేయాల్సిందే..

నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇది నా దినచర్యలో భాగమైపోయింది. నా వృత్తిలో ఒత్తిడులు సహజం. దానికి డ్యాన్స్‌ బెస్ట్‌ మెడిసన్‌ అని నమ్ముతా. రోజూ డ్యాన్స్‌ చేయడం వల్ల ఒత్తిడి దూరమవ్వడమే కాకుండా... కండరాలు బలంగా తయారవుతాయి. నేను ఫిట్‌గా, సంతోషంగా ఉంటున్నానంటే దానికి కారణం డ్యాన్స్‌.

Updated Date - 2023-02-19T11:32:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!