Breaking News: షాకింగ్: 12 ఏళ్లలో మొదటి సారిగా అక్షయ్ కుమార్ సినిమాకి 27 కట్స్ చెపుతూ 'ఏ' సర్టిఫికెట్
ABN, First Publish Date - 2023-08-01T15:45:26+05:30
ఆమధ్య విడుదలైన 'ఆదిపురుష్', ఈమధ్య విడుదలైన 'ఓపెన్ హెమర్' సినిమాలలో కొన్ని సన్నివేశాలకి గాను సెన్సార్ బోర్డుని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. 'ఓపెన్ హెమార్' సినిమాలో శృంగార సన్నివేశంలో భగవద్ గీత గురించి ప్రస్తావించంటంతో సెన్సార్ బోర్డు ఏమి చేస్తోందని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్ 2' సినిమాకి చాలా కట్స్ తో పాటు 'ఏ' సర్టిఫికెట్ కూడా ఇచ్చారు
అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్ 2' #OhMyGod2 OMG2 సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో వుంది. ఇందులో అక్షయ్ కుమార్ (AkshayKumar) శివుడు (LordShiva) గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి నుంచీ ఇబ్బందులో వుంది అని చెపుతూనే వస్తున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కోసం పంపితే అక్కడ సెన్సార్ బోర్డు ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికెట్ (OMG2 gets A certificate) ఇచ్చినట్టుగా చెపుతున్నారు. అంటే 12 ఏళ్లలో మొదటిసారిగా అక్షయ్ కుమార్ సినిమాకి ఇలా 'ఏ' సర్టిఫికెట్ రావటం ఇదే మొదటిసారి.
ఇందులో అక్షయ్ కుమార్ శివుడిగా కూడా వేస్తున్న ఇటువంటి సినిమాకి 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరంగానే వుంది. అయితే ఇలా సర్టిఫికెట్ ఇవ్వటమే కాకుండా, ఇందులో చాలా కట్స్ కూడా చెప్పినట్టుగా తెలిసింది. చాలా చోట్ల ఆడియో కట్ చెయ్యమన్నారు, అలాగే దేవుడు శివుడు పాత్ర పేరు మెసెంజర్ అఫ్ గాడ్ (Meseenger of God) గా కూడా మార్చమన్నట్టుగా సమాచారం. ఈ సినిమా మొదటి సి.బి.ఎఫ్.సి (CBFC) చూసి చాలా కట్స్ చెప్పినప్పుడు, రివైజింగ్ కమిటీ కి పంపారు. అక్కడ కూడా పరిశీలించాక ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికెట్ ఇస్తూ, చాలా చోట్ల ఆడియో కట్స్ చెప్పారని తెలిసింది. ఈ సినిమా నిడివి రెండు గంటల 36 నిముషాలు వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా ఆగుస్ట్ 11న విడుదలవుతోంది.
నిన్నటి వరకు ఈ సినిమాకి అసలు సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందో రాదో అని కూడా అనుకొని, ఈ సినిమా విడుదల వాయిదా వేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు సర్టిఫికెట్ ఇవ్వటంతో ఈ సినిమా అనుకున్న తేదీకి అంటే ఆగష్టు 11న విడుదల చేస్తున్నారు.
ఈమధ్య సెన్సార్ బోర్డు మీద ప్రజల ఒత్తిడి చాలా ఎక్కువయింది. ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించిన ఓం రౌత్ (OmRaut) దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్' #Adipurush సినిమా ఎలా సర్టిఫికెట్ ఇచ్చారు అని అందరూ సెన్సార్ బోర్డు ని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రామాయణం ప్రాతిపదికగా అంటూనే తప్పుల తడకలాగా తీశారు, దానికి సెన్సార్ బోర్డు నే తప్పు పట్టారు. అలాగే ఈమధ్య విడుదలైన ఆంగ్ల సినిమా 'ఓపెన్ హేమర్' (OppenHeimer) సినిమాలో ఒక శృంగార సన్నివేశంలో 'భగవద్ గీత' (Bhagavad Gita) గురించి మాట్లాడటం కూడా సెన్సార్ తప్పిదం కిందే బోర్డు మీద విరుచుకు పడ్డారు కొందరు. అందుకని ఈసారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా 'ఓ మై గాడ్ 2' #OMG2 సినిమాని చాలా నిశితంగా పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిసింది.
దీనితో ఈ సినిమాని 18 ఏళ్ళకి కింద వారు చూడటానికి పనికిరాదు. 18 ఏళ్ళకి పైబడిన వారు మాత్రమే ఈ సినిమా చూడగలరు అని అర్థం అవుతోంది. అంటే ఇందులో అడల్ట్ డైలాగ్స్ చాలా ఉన్నాయని కూడా అర్థం అవుతోంది. ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ అయినా ఇప్పించుకోవటానికి బాగా ప్రయత్నాలు చేశారు కానీ, వారి ఆశలు ఫలించలేదు. 13 నిముషాల సినిమాని తీసెయ్యవలసి వచ్చిందని కూడా అంటున్నారు. మొత్తం మీద 27 కట్స్ చెప్పారని, చాలా కట్స్ పురాణాల్లోని పాత్రల పదాలు, పేర్లు అని కూడా అంటున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు, పంకజ్ త్రిపాఠి (PankajTripathi), యామి గౌతమ్ (YamiGautam), పరేష్ రావెల్ (PareshRawal), అరుణ్ గోవిల్ (ArunGovil), ఓం పూరి (OmPuri) నటించారు. దీనికి అమిత్ రాయ్ (AmitRai) దర్శకుడు.