Double iSmart: ఈ సినిమాకి సంజయ్ దత్ పారితోషికం తెలిస్తే షాకవుతారు
ABN, First Publish Date - 2023-08-02T14:34:32+05:30
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అతను 60 రోజులపాటు పని చేయనున్నాడని, ఈ రెండు నెలలకు గాను అతనికిస్తున్న పారితోషికం ఎంతో తెలుసా?
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (SanjayDutt) ఇప్పుడు పూరి జగన్నాథ్ (PuriJagannadh), రామ్ పోతినేని (RamPothineni) కాంబినేషన్ లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' (DoubleiSmart) సినిమాలో ప్రధాన విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా అప్పుడే ఒక పోరాట సన్నివేశం కూడా చిత్రీకరించారు కూడా. అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నందుకు పారితోషికం ఎంత తీసుకుంటున్నాడా తెలుసా? అది తెలిస్తే షాకవ్వకుండా వుండరు.
ఈమధ్యనే అతని పుట్టినరోజు సందర్భంగా అతని పోస్టర్ కూడా సినిమానుండి విడుదల చేశారు కదా. అది బాగా వైరల్ కూడా అయింది. అయితే ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ సరిపోతాడని ముందుగానే అతడిని సంప్రదించి అతడే కావాలని తీసుకున్నారు. ఆ పాత్రకి వేరే ఎవరినీ అనుకోలేదు, ఊహించుకోలేదు కూడా, అందుకే మేకర్స్ సంజయ్ ని తీసుకున్నారు.
ఇంతకీ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి సంజయ్ దత్ కి ఇచ్చిన పారితోషికం అక్షరాలా రూ 15 కోట్ల (Rs15 crore as remuneration for Sanjay Dutt) రూపాయలు. అతను ఈ సినిమాకి రెండు నెలలు అంటే 60 రోజులపాటు తన తేదీలను ఇస్తున్నాడు అని తెలిసింది. ఈ 60 రోజులకు గాను 15 కోట్ల రూపాయలు సంజయ్ దత్ తీసుకుంటున్నారు పారితోషికంగా అంటే అది చాలా ఎక్కువ. అంటే రోజుకి 25 లక్షల రూపాయలు అన్నమాట. ఇంత భారీగా ఈమధ్య కాలంలో ఏ నటుడికీ ఇంత పారితోషికం ఇవ్వలేదని తెలిసింది.
ఈ సినిమాకి దర్శకత్వం తో పాటు పూరి జగన్నాధ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అతను ఛార్మి కౌర్ (CharmmeKaur) తో కలిపి ఈ సినిమాని తమ పూరి కనెక్ట్స (PuriConnects) బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. దీనికి విష్ణు రెడ్డి సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు. హాలీవుడ్ కి చెందిన గియాన్ని(Gianni Giannelli) అనే సినిమాటోగ్రాఫర్ ఈ పోరాటమా సన్నివేశానికి పని చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా గా తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చ్ 8, 2024 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పూరి, రామ్ పోతినేని కాంబినేషన్ లో ఇంతకు ముందు 'ఇస్మార్ట్ శంకర్' #IsmartShankar అనే విజయవంతమైన సినిమా తీసిన సంగతి తెలిసిందే.