Shilpa shetty - Raj kundra : అదేంటి రెండ్రోజుల క్రితం అలా.. ఇప్పుడిలా.. అసలు ఏమైంది?
ABN, First Publish Date - 2023-10-20T13:54:32+05:30
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. 'మేం విడిపోతున్నాం. ఈ కష్టమైన తరుణంలో మాకు అండగా ఉండండి’ అంటూ హార్డ్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు రాజ్ కుంద్రా.
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. 'మేం విడిపోతున్నాం. ఈ కష్టమైన తరుణంలో మాకు అండగా ఉండండి’ అంటూ హార్డ్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు రాజ్ కుంద్రా. దీనితో నెటిజన్లు షాక్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చి ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటి? అని నెటిజన్లు మండిపడుతున్నారు. రాజ్‌కుంద్రా తాజాగా 'యుటి 69’ అనే చిత్రంతో నటుడిగా పరిచయమవుతున్నారు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్నే తన భార్య శిల్పశెట్టితో చెప్పగా ఆమె మీదకి చెప్పు విసిరిందట. కొద్ది రోజులకు దర్శకుడు కథ చెప్పడంతో కన్విన్స అయ్యి శిల్పా అంగీకరించిందట. ఇదంతా ఇటీవల ముంబైలో జరిగిన 'యుటి 69' స్నీక్‌పీక్ లాంచ్లో చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ చూసి ఇంతలోనే ఇద్దరి మధ్య ఏం జరిగిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే రాజ్‌కుంద్రా ట్వీట్‌లో పేరేమీ ప్రస్తావించలేదు. దాంతో నెటిజన్లకు మరో అనుమానం వచ్చింది. ఆ పోస్ట్ విడాకులకు సంబంధించినదే అని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు విడాకుల గురించి కాదని పోస్ట్‌లు చేస్తున్నారు.
అందుకు కారణం లేకపోలేదు.. కొన్ని నెలలుగా రాజ్‌కుంద్రా ఫేస్‌కి హెల్మెట్ లాంటి మాస్క్ ధరించే బయటకు వెళ్తున్నారు. ఇన్నాళ్లు తనతో ఉంటోన్న మాస్క్ గురించి ఇలా ట్వీట్ చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్‌తో క్లారిటీ వచ్చింది. "ఫేర్‌వెల్ మాస్క్.. సెపరేట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. రెండేళ్లగా నన్ను రక్షిస్తునందుకు థ్యాంక్స్. 'యుటి 69'తో నా జర్నీలో కొత్త ఫేజ్ ప్రారంభం కాబోతుంది’’ అని పేర్కొన్నారు. దాంతో శిల్పశెట్టి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆ ట్వీట్ విడాకుల కోసం కాదు... ఫేస్ మాస్క్ గురించి’ అని అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం రాజ్‌కుంద్రా కలెక్ట్ చేసిన ఫేస్ మాస్క్‌ల వీడియో కూడా వైరల్ అవుతోంది. రెండేళ్ల క్రితం బ్లూ ఫిల్మ్స్ కేసులో కుంద్రా అరెస్ట్ అయ్యి ఆరు నెలలు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే!