సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sherlyn Chopra: హాట్‌ బ్యూటీగానే తెలుసు.. వెనకున్న కష్టమేంటో తెలుసా?

ABN, First Publish Date - 2023-07-23T17:49:19+05:30

అందాల ఆరబోతలో బాలీవుడ్‌ నాయికల్లో ముందువరుసలో ఉండే నటి షెర్లీన్‌ చోప్రా . హాట్‌హాట్‌గా పోస్ట్‌లతో సోషల్‌ మీడియాను హీటెక్కించే ఆమె మరోసారి విజృంభించి అందాలను ఆరబోసింది. ఓ కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన షెర్లీన్‌ గ్రీన్‌ శారీలో నాభి, ఎద అందాలతో అలరించింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు వర్షాకాలంలో కూడా టెంపరేచర్‌ పెంచేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అందాల ఆరబోతలో బాలీవుడ్‌ నాయికల్లో ముందువరుసలో ఉండే నటి షెర్లీన్‌ చోప్రా (Sherlyn Chopra). హాట్‌హాట్‌గా పోస్ట్‌లతో సోషల్‌ మీడియాను హీటెక్కించే ఆమె మరోసారి విజృంభించి అందాలను ఆరబోసింది. ఓ కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన షెర్లీన్‌ గ్రీన్‌ శారీలో నాభి, ఎద అందాలతో అలరించింది. ఈ వీడియోను చూసి Sherlyn Hot Show) నెటిజన్లు వర్షాకాలంలో కూడా టెంపరేచర్‌ పెంచేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌ నెట్‌ను షేక్‌ చేస్తోంది. షెర్లీన్‌లో ఇదొక యాంగిల్‌. నటిగా ఆమె ఇబ్బంది పడిన సందర్భాల గురించి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టి కన్నీటి పర్యాంతమైంది. ‘‘అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కొంతమంది దర్శకులు తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించారని చెప్పింది. అసభ్యకరంగా మాట్లాడేవారని తెలిపింది. ‘‘ఓ దర్శకుడు అయితే మితిమీరి మాట్లాడగా.. ‘మీకు పెళ్లైంది? ఆ విషయం మర్చిపోవద్దు’ అని బదులిచ్చా. దానికి ఆయన.. ‘మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మా మధ్య సరైన సఖ్యత లేదు’ అని ఆ దర్శకుడు చెప్పాడు అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

తనకు కిడ్నీ ఫెయిల్‌ అయిన విషయం గురించి కూడా షెర్లీన్‌ (Sherlyn Chopra Health problem) చెప్పుకొచ్చారు. ‘‘2021లో నాకు కిడ్నీ ఫెయిల్‌ అయ్యింది. నా జీవితం ఎంతో క్లిష్టంగా మారింది. బతకడం కష్టమేమో, చచ్చిపోతానేమో అనుకున్నాను. డాక్టర్‌ నాకు రెండు ఆప్షన్స్‌ ఇచ్చాడు. డయాలసిస్‌ చేయించుకుంటావా? కిడ్నీ ట్రాన్స్‌ఫ్లాంట్‌ (Sherlyn Chopra Kidney damage) చేయించుకుంటావా? అని అడిగాడు. నా కుటుంబం నన్ను అంతగా ప్రేమించదు కాబట్టి కిడ్నీ దానం చేేసందుకు ఎవరూ ముందుకు రాలేదు. నా ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా ఎవరూ నాతో మాట్లాడలేదు. డయాలసిస్‌ అంటే.. వారంలో మూడు రోజులు ఆస్పత్రికి వెళ్తూ ఉండాలి.. అలాంటి జీవితాన్ని నేను కోరుకోలేను. కానీ నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలనుకున్నా. ఒక్కరోజు కూడా కోల్పోకూడదని నిర్ణయించుకుని ముందుకు అడుగువేశా. మూడు నెలలపాటు మందులు వాడాక ఆ వ్యాధి దానంతటదే నయమైంది. అప్పుడు నాకు పునర్జన్మ లభించినట్లయింది. అయితే నా కుటుంబాన్ని మిస్‌ అయ్యానని ఎప్పుడూ అనిపించదు. సంస్కృతి, మతం.. ఇలా చాలా విషయాల్లో వారితో నాకు విబేధాలు వచ్చాయి. అందుకే వారికి దూరంగా ఉన్నా’’ అని చెప్పారు. కొంత గ్యాప్‌ తర్వాత ‘పౌరశ్‌పూర్‌ 2 వెబ్‌ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో షెర్లిన్‌.. మహారాణి ేస్నహలతగా కనిపించనుంది. ఈ నెల 28 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆల్ట్‌ ఆలాజీలో స్ర్టీమింగ్‌ కానుంది.

Updated Date - 2023-07-23T17:49:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!