సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bollywood Actor: ‘ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ని వదిలేసి మంచి పని చేసింది.. లేకపోతేనా..’

ABN, First Publish Date - 2023-03-31T13:28:26+05:30

బాలీవుడ్‌లో నెపోటిజం (Nepotism)పై చర్చ ఎప్పటి నుంచో ఉన్నదే. దాని వల్లే కొందరూ స్టార్స్ అవుతున్నారని, టాలెంట్ ఉన్న బయటివారు మాత్రం అవకాశాలు రాక పరిశ్రమని వీడాల్సి వస్తుందని విమర్శలు సైతం వినిపించాయి.

Priyanka chopra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో నెపోటిజం (Nepotism)పై చర్చ ఎప్పటి నుంచో ఉన్నదే. దాని వల్లే కొందరూ స్టార్స్ అవుతున్నారని, టాలెంట్ ఉన్న బయటివారు మాత్రం అవకాశాలు రాక పరిశ్రమని వీడాల్సి వస్తుందని విమర్శలు సైతం వినిపించాయి. బీ టౌ‌న్‌లోని కొందరు గ్యాంగ్‌గా మారి బయటివారిని ఛాన్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్‌లో గ్యాంగ్ తనకు వల్లే అవకాశాలు రాలేదని ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఆవేదన వ్యక్తం చేయడంతో దీనిపై చర్చ మరోసారి ఊపందుకుంది.

హాలీవుడ్ మీడియాతో ప్రియాంక తాజాగా మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో కొందరు నాపై కక్ష్య కట్టారు. నాకు అవకాశాలు రాకుండా చేశారు. దాని వల్లే నేను హిందీ చిత్ర పరిశ్రమని వీడాల్సి వచ్చింది’ అని రాసుకొచ్చింది. దీనిపై ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. అందులో కంగనా రనౌత్ కూడా ఒకరు. ‘షారుఖ్ ఖాన్‌తో ప్రియాంక చోప్రా స్నేహంగా ఉండడం కరణ్‌ జోహార్‌కి నచ్చలేదు. దానివల్లే తను హాలీవుడ్‌కి వెళ్లాల్సి వచ్చింది’ అని సోషల్ మీడియాలో కంగన రాసుకొచ్చింది.

తాజాగా మరో బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ (Shekhar Suman) కూడా బాలీవుడ్ మాఫియాపై ఘాటుగా స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ ట్వీట్‌లో.. ‘ప్రియాంక చోప్రా చెప్పిన విషయాలు షాకింగ్‌గా ఏం లేవు. సినీ పరిశ్రమలోని అలాగే నడుస్తుందని అందరికీ తెలుసు. మీరు అక్కడి నుంచి వెళ్లిపోయే వరకు అక్కడి మాఫియా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అదే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో జరిగింది’ అని ఓ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. (Shekhar Suman on Priyanka chopra Exit)

అలాగే.. ‘ఇతరులకు కూడా ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఇలాగే పరిశ్రమ నుంచి వెళ్లిపోయారు. కాబట్టి దాన్ని తట్టుకోండి లేదా ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ప్రియాంక వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లుగానే హాలీవుడ్‌కి వెళ్లి మంచి పని చేసింది. అందుకే ఇలా హాలీవుడ్‌లో ఇండియాకి ప్రాతినిథ్యం వహిస్తోంది’ అని మరో ట్వీట్‌లో శేఖర్ పేర్కొన్నాడు. (Shekhar Suman on Bollywood Mafia)

ఇవి కూడా చదవండి:

Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..

Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..


అలాగే మరో ట్వీట్‌లో.. ‘పరిశ్రమలోని నలుగురు వ్యక్తులు కలిసి ఇలా చేస్తున్నారు. వారే నన్ను చాలా ప్రాజెక్టుల నుంచి తొలగించారు. ఆ గ్యాంగ్‌స్టర్ పాముల కంటే ప్రమాదకారులు. అయితే.. అడ్డంకులు సృష్టించగలరు. అంతేకాని, మనల్ని ఆపలేరు’ అని తెలియజేశాడు. (Shekhar Suman about Bollywood Gang)

Updated Date - 2023-03-31T13:38:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!