సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kartik Aaryan: హీరోయిన్‌తో వైరల్ ఫొటోలపై స్పందించిన హీరో

ABN, First Publish Date - 2023-02-19T19:17:26+05:30

సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన హీరో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘పతి, పత్ని ఔర్ వో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. కార్తిక్ కొన్నాళ్ల క్రితం ‘లవ్ అజ్ కల్ 2’ (Love Aaj Kal 2)లో నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన హీరో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘పతి, పత్ని ఔర్ వో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. కార్తిక్ కొన్నాళ్ల క్రితం ‘లవ్ అజ్ కల్ 2’ (Love Aaj Kal 2)లో నటించారు. ఈ చిత్రంలో సారా అలీ ఖాన్‌ (Sara Ali Khan)కు జంటగా కనిపించారు. ఈ మూవీ 2020లో విడుదలైంది. ‘లవ్ అజ్ కల్ 2’ రిలీజ్ అయినప్పటి నుంచి కార్తిక్, సారా డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియాలో రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వదంతులు షికార్లు కొడుతుండగానే ఈ మధ్యనే వీరిద్దరు ఉదయ్‌పూర్‌లో జంటగా నవ్వుతూ కనిపించారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వైరల్ ఫొటోలపై కార్తిక్ ఆర్యన్ తాజాగా స్పందించారు.

సారా అలీ ఖాన్ తాను ఒకే ప్రదేశంలో ఉండటంతో కలసి కనిపించామని కార్తిక్ ఆర్యన్ తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొంత మంది ఫొటోలను క్లిక్ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయని పేర్కొన్నారు. ‘‘మేం ఇద్దరం ఆ సమయంలో ఒకే ప్రదేశంలో ఉన్నాం. అప్పటికే అక్కడ ఉన్న కొంతమంది ఫొటోలను తీయడం ప్రారంభించారు. కానీ, కొన్ని పిక్స్ మాత్రమే నెట్టింట కనిపించడంతో నేను ఆశ్చర్యానికి గురయ్యాను’’ అని కార్తిక్ చెప్పారు. ఇద్దరం కలసి ఎటువంటి సినిమా చేయడం లేదని చెప్పారు. ఇక కార్తిక్ ఆర్యన్ కెరీర్ విషయానికి వస్తే.. ‘షెహజాదా’ (Shehzada) లో తాజాగా నటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురం’ లోకి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కృతి సనన్, మనీషా కొయిరాలా, పరేష్ రావల్, రాజ్ పాల్ యాదవ్, సచిన్ ఖడ్గేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-02-19T19:17:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!