కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dunki: షారుఖ్ కోసం.. విదేశాల నుంచి ఇండియాకు భారీగా అభిమానులు

ABN, First Publish Date - 2023-11-30T19:18:07+05:30

షారూక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సినిమా విడుద‌ల తేదీ దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠత నెలకొన్నది, ఈ నేపథ్యంలో వందలాది మంది షారూక్ ఖాన్ అభిమానులు డిసెంబర్ నెలలో ఈ సినిమాను తమ మాతృదేశమైన భారత్‌లో చూడటానికి ఇక్కడకు వస్తుండటం విశేషం.

dunki

షారూక్ ఖాన్(Shah Rukh Khan), రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’(Dunki). ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సినిమా విడుద‌ల తేదీ దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠత నెలకొన‌గా, డంకీ డ్రాప్ 1 వీడియోతో పాటు డంకీ డ్రాప్ 2 విడుదలైన లుట్ పుట్ గయా.. సాంగ్ అంచనాలను పెంచాయి. ప్రేమ, స్నేహం వంటి ఎమోషనల్ అంశాలతో సినిమా తెరకెక్కింది. ఈ నేపథ్యంలో వందలాది మంది షారూక్ ఖాన్ అభిమానులు డిసెంబర్ నెలలో ఈ సినిమాను తమ మాతృదేశమైన భారత్‌లో చూడటానికి ఇక్కడకు వస్తుండటం విశేషం.

ఇప్ప‌టికే డంకీ (Dunki) సినిమాలో టీజ‌ర్‌లోని ఆకట్టుకునే విజువల్స్, భావోద్వేగాలు విదేశాల్లో ఉన్న‌ వారికి తమ దేశంలోని మధుర స్మృతులను గుర్తుకు తెచ్చాయి. దీంతో వారు తమ కుటుంబాలు, సన్నిహితులతో కలిసి ఈ క్రిస్మస్ పండుగ సీజన్‌లో డంకీ సినిమాను చూసి ఆ యూనిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని పొందటానికి తహతహ లాడుతున్నారు. ఇలా ప్రపంచం నలు మూలల నుంచి వచ్చిన అభిమానులు తమ అభిమాన కథానాయకుడు నటించిన డంకీ సినిమా గ్లోబల్ సెలబ్రేషన్స్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు.


అంతేకాకుండా షారూక్ ఖాన్ సినిమాలను ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ప్రమోట్ చేయటానికి ఆయన అభిమాన సంఘాలు నిత్యం వినూత్న మార్గాలను అన్వేషిస్తుంటాయి. డంకీ(Dunki ) విషయంలోనూ అలాంటి మార్గాన్నే వారు ఎంచుకున్నారు. ఈ సినిమాలో షారూక్ (Shah Rukh Khan) తన వారి కోసం అక్రమ మార్గాలతో సరిహద్దులను దాటితే ఇప్పుడు నేపాల్, కెనడా, అమెరికా, ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి 500కి పైగా అభిమానులు చట్ట బద్దంగా సరిహద్దులను దాటి త‌మ‌ మాతృదేశానికి వ‌చ్చి సినిమాను చూడ‌డానికి రెడీ అవుతున్నారని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి,. త‌మ‌ వారి కోసం ఎంత దూరమైనా వెళ్లాలనేది సినిమా మెయిన్ థీమ్ కాగా అదే సెంటిమెంట్‌ను ఫ్యాన్స్ ఇప్పుడు ఫాలో అవబోతున్నారు.

జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ డంకీ(Dunki) చిత్రాన్ని నిర్మిస్తుండగా బోమన్ ఇరాని, తాప్సీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు కాగా.. ఈ చిత్రం ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 7న, సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల కానుంది.

Updated Date - 2023-11-30T19:18:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!