Shah Rukh Khan: హిట్ కోసం మళ్లీ అదే సెంటిమెంట్.. షారుఖ్‌కు కలిసొచ్చేనా?
ABN, First Publish Date - 2023-12-12T15:13:13+05:30
ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న ఏకైక హీరో షారుఖ్ ఖాన్. తాజాగా ఆయన మరో ఆసక్తికర చిత్రం‘డంకీ’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో చిత్రం విజయం సాధించాలని కాంక్షిస్తూ దేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తూ తనకు కలిసొచ్చిన సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు.
ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అనే చెప్పాలి. ఇప్పటికే జనవరిలో ‘పఠాన్’ (Pathaan), సెప్టెంబర్‌లో ‘జవాన్’ (Jawan) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన థియేటర్ల వద్ద ఒకదాన్ని మించి ఒకటి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పుడు తాజాగా ఆయన మరో ఆసక్తికర చిత్రం ‘డంకీ’ (Dunki)తో వస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. అదే రోజూ ప్రభాస్ సలార్‌కు విడుదల కానుంది.
జియో స్టూడియోస్ (Jio Studios), రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ (Red Chillis Entertainment), రాజ్‌కుమార్ హిరానీ (Raj Kumar Hirani Films) ఫిల్మ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మున్నా బాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే (PK) వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) డైరెక్ట్ చేస్తున్నారు. తాప్సీ పన్ను (Tapsee) బోమన్ ఇరానీ (boman Irani), విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అయితే షారుఖ్ ఖాన్‌కు తన ప్రతీ సినిమా విడుదలకు ముందు దేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శించే అలవాటు ఉంది. దానిని ఆనవాయితీగా కూడా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం తెల్లవారు జామున జమ్మూలోని వైష్ణో దేవీ (Vaishno Devi) ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పఠాన్, జవాన్ సినిమాల విడుదల సమయాల్లోనూ ఆయన వైష్ణో దేవీ ఆలయం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
గతంలో రెండు సార్లు ఆలయాలను, దర్గాలను సందర్శించిన షారుక్‌కు ఆయన కేరీర్‌లోనే పెద్ద విజయాలను అందుకున్నారని, ఇప్పుడు మరోసారి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తుండడంతో ఆయన రాబోవు చిత్రం ‘డంకీ’ (Dunki) కూడా అంతకుమించిన హిట్ కొడుతుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా షారుఖాన్ భార్య గౌరీ హిందు మతస్తురాలు కాగా వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి షారుఖ్ ముస్లిం మతంతో పాటు హిందూ మతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తూ వస్తున్నారు.