Pathaan: ‘నేను చెబితే విన్నారా.. ఇప్పుడు ఏమైంది’.. స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఆర్కే
ABN, First Publish Date - 2023-01-03T10:34:49+05:30
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సినిమా ‘పఠాన్’ (Pathaan)పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సినిమా ‘పఠాన్’ (Pathaan)పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో దీపికా పదుకొనే (Deepika Padukone) నటించిన ‘బేషరమ్ రంగ్’ సాంగ్‌లో డ్రెస్సింగ్, డ్యాన్స్ మూమెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలోనే ఈ సినిమాపై సినీ విమర్శకుడినని చెప్పుకునే నటుడు కమాల్ రషీద్ ఖాన్ (Kamaal Rashid Khan) సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
నిజానికి చాలాకాలం క్రితమే ఈ చిత్రం పేరుని ‘పఠాన్’ కాకుండా వేరేది పెట్టాలని కేఆర్కే సూచించాడు. అలాగే సందర్భం దొరికినప్పుడల్లా ఈ చిత్రం గురించి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా సైతం ఈ మూవీ గురించి ఓ పోస్ట్‌ని షేర్ చేశాడు.
కేఆర్కే ట్విట్టర్లో.. ‘ఈ రోజు పఠాన్ ట్రైలర్ విడుదల కాదు. ఇంతకుముందు నేను ఏది చెప్పానో అది నిజం అని రుజువు అయ్యింది. పఠాన్ టైటిల్‌ని మార్చాలని నిర్ణయించుకున్నారు! ఈ టైటిల్ కరెక్ట్ కాదని ఎనౌన్స్మెంట్ రోజే చెప్పాను. కానీ షారుఖ్ ఖాన్ నా మాట వినడానికి నిరాకరించాడు. చివరకు అతను బలవంతంగా నా మాట వినవలసి వస్తుంది’ అని రాసుకొచ్చాడు.
మరో పోస్ట్‌లో.. ‘అంతేకాకుండా నాకు సినిమా నిర్మాణం గురించి ఆదిత్య చోప్రా, షారుఖ్ కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉందనడానికి ఇదే నిదర్శనం!. యశ్ రాజ్ చోప్రా కారణంగా వీరిద్దరూ హీరో, ఫిల్మ్ మేకర్ అయ్యారు. కానీ నాకు దేవుడు ఇచ్చిన ప్రతిభ ఉంది. కాబట్టి ప్రతి ఫిల్మ్ మేకర్ నా మాట వినాలి' అని పేర్కొన్నాడు.