Shah Rukh Khan: ట్రైన్ ని హైజాక్ చేసిన షా రుఖ్, అలియా భట్ కావాలని డిమాండ్
ABN, First Publish Date - 2023-08-31T13:22:03+05:30
'పఠాన్' హిట్ తరువాత షారుఖ్ ఖాన్ ఈసారి దక్షిణాదికి చెందిన దర్శకుడు అట్లీతో చేతులు కలిపాడు 'జవాన్' సినిమా కోసం. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పడుకొనే, ప్రియమణి, యోగిబాబు ఇలా చాలామంది దక్షిణాదివారు నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. చాలా ఆసక్తికరంగా వుంది.
సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటిగా చెపుతున్న 'జవాన్' #Jawan ట్రైలర్ విడుదలైంది. #JawanTrailer షా రుఖ్ ఖాన్ (ShahRukhKhan), అట్లీ (Atlee) కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇది హిందీతో పాటు, మిగతా నాలుగు దక్షిణాది భాషల్లో కూడా విడుదలవుతోంది. అందుకే హిందీ ట్రైలర్ తో పాటు, తెలుగు ట్రైలర్ కూడా ఈరోజు విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో చాలా ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయని, సినిమా అయితే కచ్చితంగా చూడాలి అనిపించేట్టు వుంది. దర్శకుడు అట్లీ (Atlee) ఈసారి చాలా పెద్ద స్కేల్ లో సినిమా చేసాడు అనిపిస్తోంది.
షా రుఖ్ ఖాన్ ఒక ట్రైన్ హైజాక్ చేసినట్టుగా కనపడుతోంది, నయనతార (Nayanthara) ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడుతోంది. షా రుఖ్ ని మీకు ఏమి కావాలి, మీ డిమాండ్ ఏంటి అని అడిగితే షా రుఖ్ ఖాన్ వెంటనే 'అలియా భట్ (AliaBhat) కావాలి' అని అంటాడు. ఇలాంటి సరదా సన్నివేశాలతో పాటుగా, దేశభక్తిని చూపించే మాటలు కూడా మెండుగా ఉన్నాయని అనిపిస్తోంది. ఎందుకంటే ఇంకో షా రుఖ్ ఖాన్ జవాన్ రూపంలో కనపడతాడు. "మేము జవాన్లము, మా ప్రాణాలు ఒక్కసారి కాదు వెయ్యిసార్లు అయినా పోగొట్టుకుంటాం, అదీ దేశం కోసమే" అన్న దేశభక్తిని చాటే డైలాగ్ కూడా వుంది.
"మీలాంటి వాళ్ళు దేశాన్ని అమ్ముకుంటూ పోతే, మీ లాభాల కోసం మా ప్రాణాలు త్యాగం చేయలేము," అన్న డైలాగు కూడా ఆసక్తికరంగా వుంది. విజయ్ సేతుపతి (VijaySethupathi) కూడా రెండు రకాల పాత్రలో కనపడుతున్నాడు. ఒకటి యంగ్, ఇంకోటి ముసలి పాత్ర. అతను విలన్ గా చేసినట్టు కనపడుతుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. విజయ్ సేతుపతి ప్రపంచంలో ఆయుధాలు అమ్మే డీలర్స్ లో నాలుగో స్థానంలో వున్నాను అంటాడు ఇందులో అంటే అతను ఆయుధాలు అమ్మే డీలర్. అలాగే నయనతార కి, షా రుఖ్ ఖాన్ కి ఒక ప్రేమ సన్నివేశం కూడా వుంది అంటే వాళ్ళిద్దరికీ ఇదివరకే పరిచయం వుంది అనిపిస్తోంది. అలాగే షా రుఖ్ ఖాన్ ని దీపికా పడుకునే (DeepikaPadukune) మల్లయుద్ధం లో ఓడిస్తుంది. ఇంతకీ షా రుఖ్ ఖాన్, ఆ ఆరుగురు అమ్మాయిలు వుండే టీం ఈ ట్రైన్ హైజాక్ ని ఎలా ఆపుతారు, అలాగే టెర్రరిస్ట్ ల నుండి దేశాన్ని ఎలా కాపాడుతారు అన్నది ఈ సినిమా కథ నేపధ్యం అనిపిస్తోంది.
మంచి విజువల్స్ తో, ఆసక్తికర సన్నివేశాలతో, అన్ని రకాల హంగులతో ఈ సినిమా ముస్తాబు అయినట్టుగా వుంది. ఇందులో అందరికీ కావలసినవన్నీ పెట్టి ఈ సినిమా తీసినట్టుగా కనపడుతోంది. సెప్టెంబర్ 7న విడుదలవుతున్న ఈ సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.