Sushant Singh Rajput : సూసైడ్ గురించి ఏం చెప్పిందంటే.. !
ABN, First Publish Date - 2023-10-07T15:58:22+05:30
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఓ సంచలనం. ఆయన మరణించి మూడేళ్లు గడుస్తున్నా ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. సుశాంత మరణానికి అతని ప్రేయసి రియా చక్రవర్తి కారణం అని సుశాంత తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఓ సంచలనం. ఆయన మరణించి మూడేళ్లు గడుస్తున్నా ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. సుశాంత మరణానికి అతని ప్రేయసి రియా చక్రవర్తి కారణం అని సుశాంత తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియాతోపాటు ఆమె సోదరుడిని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె బెయిల్ మీద బయటికొచ్చింది. కెరీర్ పరంగా బిజీగా ఉంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
రియా మాట్లాడుతూ '‘సుశాంత్ మానసిక ఆరోగ్య సమస్యల గురించి తనకు తెలుసు. తను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నాకు తెలుసు. సుశాంత్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తన లైఫ్ మారిపోయింది. అయితే అతను అంతకుముందే బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగాడు. అందువల్ల అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం నేనేప్పుడూ చేయలేదు. నేను అలాంటి మనిషిని కాదు. సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేశారా? అన్న ప్రశ్నకు ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు అని సమాధానమిచ్చింది.