సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

ABN, First Publish Date - 2023-04-02T11:25:35+05:30

ఓ భాషలో హిట్ అయ్యిన సినిమాలను మరో భాషలో రిమేక్ చేయడం ఎప్పటినుంచో వస్తున్నదే.

Kaithi Remake Bholaa
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ భాషలో హిట్ అయ్యిన సినిమాలను మరో భాషలో రిమేక్ చేయడం ఎప్పటినుంచో వస్తున్నదే. అలా ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్‌ (Tollywood) నుంచి బాలీవుడ్‌ (Bollywood) వరకు ఎన్నో హిట్లు కొట్టినవారు ఉన్నారు. తమిళ నటుడు విజయ్ వంటి కొందరు యాక్టర్స్ అయితే.. ఇతర భాషల్లోని సినిమాల రిమేకుల వల్లనే స్టార్స్ అయ్యారు. అదే సమయంలో కొన్ని హిట్ సినిమాలను భ్రష్టు పట్టించినవారు కూడా ఉన్నారు.

ఇటీవలికాలంలో రిమేకులతో సూపర్ హిట్లు కొట్టిన బాలీవుడ్ హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) ముందు వరుసలో ఉంటాడు. సూర్య హీరోగా నటించిన ‘సింగం’ (Singam) సినిమాలు, మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ (Drishyam) సినిమాలతో అజయ్ హిట్లు కొట్టాడు. ఈ కోవాలోనే ఆయన తాజాగా నటించిన చిత్రం ‘భోళా’ (Bholaa). ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తమిళ నటుడు కార్తీ (Karthi) హీరోగా నటించిన ‘ఖైదీ’ (Kaithi) చిత్రానికి ఇది రిమేక్. అయితే అనుకున్నట్లుగా ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. (Bholaa movie public talk)

కారణాలు ఏంటంటే..

అజయ్ ‘భోళా’ మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే.. ‘ఖైదీ’ని అలాగే మక్కీకి మక్కీ దించేయకుండా కొన్ని మార్పులు చేశారు. కొన్ని మసాలాలు, కమర్షియల్ హంగులు అద్దారు. అది అంతగా రుచించలేదు. ఐటెం సాంగ్ పెట్టడం, తండ్రి కూతుళ్ల బంధాన్ని బలంగా చూపించలేకపోవడం, ఓరిజినల్ మూవీలో లేని హీరోయిన్ పాత్రను పెట్టడం ఈ చిత్రానికి మైనస్‌గా మారాయి. అసలు ‘ఖైదీ’ చూసిన పలువురు సినీ లవర్స్ ‘భోళా’ చూసి ఏం బాలీవుడ్‌రా బాబు.. మరో సౌత్ సినిమా చెడగొట్టారు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. (Bholaa Public Review)

నిజానికి ఖైదీ సినిమా ఓ వైపు రియాలిస్టిక్‌గా ఉంటూనే యాక్షన్ సీన్స్ అదరగొడుతుంది. దాని వల్లే ఆ సినిమాని సౌత్ ప్రేక్షకులు బాగా ఆదరించారు. అక్కడ అదే లోపించింది. అయితే.. లోకేశ్ కనగరాజ్ ‘విక్రమ్’తో వచ్చిన హైప్ కారణంగా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్‌నే సాధించింది. అనంతరం నెగటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం గట్టెక్కడం కష్టంగానే అనిపిస్తోంది. (Ajay Devgn Bholaa movie result)

కాగా.. గతకొంతకాలంగా బాలీవుడ్‌కి బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతోంది. ఈ తరుణంలో వచ్చిన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘పఠాన్’ (Pathaan) సినిమా సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1000 కోట్లకిపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అనంతరం వచ్చిన రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ‘తూ ఝాఠీ మై మక్కర్’ ఆ ఊపుని కొనసాగిస్తూ.. రూ.100 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసింది. అయితే.. తాజాగా ‘భోళా’ మూవీ ప్లాప్‌తో హిందీ చిత్రపరిశ్రమ మరోసారి డల్ అయిపోయింది. అంతేకాకుండా.. అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikuntapuramulo) రిమేక్ సైతం ‘షాహజాదా’ (Shehzada)గా రిమేక్‌ కాగా.. అది కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో బాలీవుడ్ మంచి సినిమాలను చెడగొడుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

IPS Sajjanar: దయచేసి అలా చేయకండి.. అమితాబ్‌కి టీఎస్‌ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..

Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Updated Date - 2023-04-02T11:47:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!