సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ranveer Singh: వరుస ఫ్లాపుల్లో ఉన్నా ఆ విషయంలో నెం.1.. విరాట్‌ని వెనక్కి నెట్టి మరీ.. సౌత్ నుంచి అల్లు అర్జున్ మాత్రమే..

ABN, First Publish Date - 2023-03-23T14:47:54+05:30

గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే.

Ranveer singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు పర్వాలేదనిపించినా.. కొన్నైతే చాలా దారుణమైన వసూళ్లని సాధించాయి. అయినా దేశవ్యాప్తంగా ఆయన బ్రాండ్ వ్యాల్యూ ఏమాత్రం తగ్గలేదు. పైగా ఇంకాస్త పెరిగింది కూడా. రూ.1500 కోట్ల బ్రాండ్ విలువతో ఆయన జీవితంలోనే బ్రాండ్ వ్యాల్యూని కలిగి ఉన్నాడు. (most valued celebrity of 2023)

‘అత్యంత విలువైన సెలబ్రిటీ 2022’గా ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని వెనక్క నెట్టి మరీ.. రణ్‌వీర్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. తాజాగా 2023కి సంబంధించిన క్రో అనే కంపెనీ ఓ జాబితాని విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా బ్రాండ్ వ్యాల్యూ కలిగిన టాప్ 25 మంది లిస్ట్‌ని విడుదల చేసింది. అందులో రణ్‌వీర్ మొదటి స్థానంలో ఉండగా.. రూ.1400 కోట్లతో విరాట్ రెండో స్థానానికి పడిపోయాయి. ఇక మూడో స్థానంలో మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) (రూ.1200 కోట్లు) ఉన్నాడు.

ఇకపోతే.. ఈ లిస్ట్‌లో దక్షిణాది నుంచి ఒకే ఒక్క హీరో ఉన్నాడు. ఆయనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). 2021లో విడుదలైన ‘పుష్ప’ సినిమాతో ఈ నటుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బ్రాండ్ వ్యాల్యూ రూ.259 కోట్లతో 20వ స్థానంలో నిలిచాడు. అలాగే సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)కి సైతం ఈ జాబితాలో చోటు దక్కింది. రూ.209 కోట్లతో రష్మిక 25వ స్థానంలో నిలవడం విశేషం. కాగా.. రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’తో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్‌గా చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Updated Date - 2023-03-23T14:49:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!