సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ranbir Kapoor: నేను, దీపిక బంగు తాగి ఏం చేశామంటే..?

ABN, First Publish Date - 2023-03-02T19:48:10+05:30

బాలీవుడ్ స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. తాజాగా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkaar) లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. తాజాగా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkaar) లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఆసక్తిక కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను కూడా చెప్పారు. ఈ సందర్భంగా తాను నటించిన ఓ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఓ సీన్‌ చేస్తున్నప్పుడు బంగ్ తాగానని చెప్పారు.

రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా ‘యే జవానీ హై దివానీ’ (Yeh Jawaani Hai Deewani). ఆదిత్య రాయ్ కపూర్, దీపికా పదుకొణె, కల్కి కొచ్లిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టంది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలోని ‘బలం పిచికారి’ (Balam Pichkari) పాట ఎంతో హిట్ అయింది. ఈ సాంగ్‌ను బంగు తాగి చేశానని రణ్‌బీర్ చెప్పారు. ‘‘దాదాపుగా ఎనిమిది రోజుల పాటు సాంగ్‌ను షూట్ చేశాం. చాలా మంది డ్యాన్సర్స్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో ఈ పాటలో డ్యాన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నేను, ఆదిత్య, కల్కి, దీపిక అందరం బంగు తాగేవాళ్లం. డ్యాన్సర్స్‌కు దూరంగా ఈ డ్రింక్‌ను దాచిపెట్టేవాళ్లం. ఈ విషయం ఎవరికి కూడా తెలియదు’’ అని రణ్‌బీర్ చెప్పారు.

‘యానిమల్’ (Animal) కోసం భారీగా గడ్డాన్ని పెంచుకున్నానని రణ్‌బీర్ చెప్పారు. రాహా పుట్టినప్పుడు కూడా ఇదే లుక్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. గడ్డం తీసేసిన తర్వాత తనను గుర్తు పడుతుందో లేదోననే ఆందోళనను ఆయన వ్యక్త పరిచారు. తనను ఒకవేళ రాహా గుర్తుపట్టలేకపోతే గుండె ముక్కలవుతుందని చెప్పారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-02T19:48:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!