Rakhi Sawant: ‘నా భర్త నా న్యూడ్ వీడియోలను అమ్ముకున్నాడు’
ABN, First Publish Date - 2023-02-10T14:47:26+05:30
గత కొన్నిరోజులుగా రాఖీ సావంత్ (Rakhi Sawant), ఆమె భర్త ఆదిల్ దురానీ (Adil durrani)కి సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆదిల్‌పై రోజుకో విషయంపై విమర్శలు చేస్తోంది.
గత కొన్నిరోజులుగా రాఖీ సావంత్ (Rakhi Sawant), ఆమె భర్త ఆదిల్ దురానీ (Adil durrani)కి సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆదిల్‌పై రోజుకో విషయంపై విమర్శలు చేస్తోంది. ఇటీవలే అసభ్యకరంగా (Unnatural) శృంగారం చేశాడని, కట్నం గురించి వేధించాడని ఆదిల్‌పై రాఖీ కేసు పెట్టింది. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో మరో ఆదిల్‌పై రాఖీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది.
రాఖీ మాట్లాడుతూ.. ‘ఆదిల్ నా న్యూడ్ వీడియోలను తీసి కొందరికి విక్రయించాడు (sold my Videos). ఆ కేసు ప్రస్తుతం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉంది. అంతేకాకుండా నన్ను మోసం చేశాడు. అతను తనూ చందేల్ అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటాడు’ అని రాఖీ పేర్కొంది.
Janhvi Kapoor: ‘దాని గురించి ఎవరూ మాట్లాడరు.. అందరికీ ఇదే కావాలి’
అలాగే.. ఆదిల్‌కి సంబంధించిన బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరగుతోంది. ఈ తరుణంలో కోర్టుకి వెళ్లిన రాఖీ మీడియాతో మాట్లాడింది. ‘ఆదిల్ నన్ను మోసం చేశాడు. అతనికి బెయిల్ రాకూడదు. అందుకే నా బాధను చెప్పడానికి కోర్టుకి వచ్చాను. అతను నన్ను చిత్రహింసలు పెట్టాడు. దానికి సంబంధించిన రుజువుగా మెడికల్ బిల్స్ ఉన్నాయి. అలాగే అతను నా దగ్గర ఓటీపీ తెలుసుకొని నా డబ్బుని దొంగిలించాడు’ అని చెప్పుకొచ్చింది. అలాగే తన నుంచి రూ.1.50 కోట్లు తీసుకున్నట్లు ఆదిల్ ఒప్పుకున్న వీడియోను కూడా రాఖీ లీక్ చేసింది.