Priyanka Chopra: వయసులో ఉన్నప్పుడే ప్రియాంక తన అండాలను దాచిందట.. ఎందుకంటే..
ABN, First Publish Date - 2023-03-29T11:16:45+05:30
బాలీవుడ్ (Bollywood)లోని ఎంతోమంది తారలు హాలీవుడ్ (Hollywood)లోనూ పాగా వేయాలని ప్రయత్నించారు.
బాలీవుడ్ (Bollywood)లోని ఎంతోమంది తారలు హాలీవుడ్ (Hollywood)లోనూ పాగా వేయాలని ప్రయత్నించారు. అయితే.. వారిలో సక్సెస్ అయ్యింది ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మాత్రమేనని చెప్పాలి. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉండగానే.. హాలీవుడ్‌లో అడుగుపెట్టి వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళుతోంది. ఇంతకుముందు సూపర్ హిట్ సిరీస్ ‘మ్యాట్రిక్స్ 4’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. త్వరలో ‘సిటాడెల్’ (Citadel)తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పిల్లల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
తన కంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్‌ని ప్రియాంక చోప్రా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకి ఇటీవలే ఈ సరోగసి ద్వారా పాప మాల్తీ పుట్టింది. పాప పుట్టే సమయానికి ప్రియాంక వయస్సు 39 సంవత్సరాలు కావడం విశేషం. దీనిపై ఈ భామ స్పందిస్తూ.. గైనకాలజిస్ట్ అయిన తన తల్లి డాక్టర్ మధు చోప్రా (Madhu Chopra) సలహా మేరకు.. తన 30 ఏళ్ల ప్రారంభంలో తన అండాలను స్టోర్ చేసినట్లు వెల్లడించింది. (Priyanka Chopra froze her eggs)
‘నా ఏజ్ 30కి దగ్గర ఉన్నప్పుడు నా దృష్టంతా కెరీర్ మీదే ఉండేది. ఎదో ఒకటి సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాను. అదే సమయంలో పిల్లలు కనేందుకు.. నాకు ఇష్టమైన వారెవరూ ఎదురుపడలేదు. అయితే.. భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశంపై నాకు సందేహం ఉండేది. ఇదే విషయాన్ని గైనకాలజిస్ట్ అయిన మా అమ్మ మధుకి చెబితే.. ఆమె ఓ సలహా ఇచ్చింది. అదే అండాలను దాచిపెట్టడం గురించి. మా అమ్మ సూచన మేరకే నా అండాలను (Eggs) ఫ్రీజ్ చేశాను. ఎందుకంటే 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం, పిల్లలు కనడం కష్టమైన పని. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్‌కి ఇది అవసరం కూడా. అందుకే నా స్నేహితులకి అండాలను దాచమని నేను సలహా ఇచ్చాను. ఇకపై కూడా ఇస్తాను. భవిష్యత్తు కోసం ఎన్నో పనులు చేస్తున్నాం. మీకు ఆరోగ్యమైన పిల్లలు పుట్టడానికి అండాలను దాచి, మీకు మీరే బహుమతిగా ఇచ్చుకోండి’ అని అభిమానులకి ప్రియాంక సలహా ఇచ్చింది. కాగా.. ప్రియాంక ప్రస్తుతం ‘సిటాడెల్’తో పాటు రోమ్ కామ్ ‘లవ్ ఎగైన్’, ఓ బాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. (Priyanka Chopra planing for future)
ఇవి కూడా చదవండి:
Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..
Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..
Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..
Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..
Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..
Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..
Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..
Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..
NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..