Priyanka Chopra: నిక్ జోనాస్‌తో డేటింగ్ చేయొద్దని అనుకుందట.. దానికి కారణం ఏంటంటే?
ABN, First Publish Date - 2023-03-30T14:04:02+05:30
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రస్తుతం హాలీవుడ్ (Hollywood)లోనూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రస్తుతం హాలీవుడ్ (Hollywood)లోనూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్‌సిరీస్‌లు చేస్తూ కెరీర్లో దూసుకెళుతోంది. ఇటీవలే క్రేజీ మూవీ ఫ్రాంచైజీ ‘మ్యాట్రిక్స్ 4’ ద్వారా బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. తాజాగా ‘సిటడెల్’ (Citadel) వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ వెబ్‌సిరీస్ ఏప్రిల్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌ని జోరుగా సాగిస్తోంది ఈ సిరీస్ టీమ్. ఇందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త నిక్ జోనాస్ (Nick Jonas)తో పెళ్లి గురించి సంచలన విషయాలను వెల్లడించింది. (Citadel Webseries)
ప్రియాంక మాట్లాడుతూ.. ‘నిక్‌తో నాకు మొదట పరిచయమైనప్పుడూ అతనితో డేటింగ్ చేయొద్దని అనుకున్నాను. ఎందుకంటే.. అప్పటికే నాకు 36 ఏళ్లు. నాకు పిల్లలు కావాలి. అదే అతనితో డేటింగ్ చేయొద్దనుకోడానికి ప్రధాన కారణం. ఎందుకంటే అప్పటికీ అతనికి కేవలం 26 ఏళ్లు మాత్రమే. ఆ వయస్సులో పిల్లలంటే ఎంత ఇష్టమున్నప్పటికీ.. కెరీర్ మీద మాత్రమే ప్రధానం నా దృష్టి ఉండేది. అలాంటప్పుడూ దాదాపు 25 ఏళ్ల వయస్సులో అతను పిల్లలు కనడానికి ఇష్టపడతాడ లేదా అనే అనుమానం ఉండేది. కాని.. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నేను UNICEFతో కలిసి పిల్లల కోసం పనిచేశాను. పిల్లల ఆసుపత్రులలోనూ స్వచ్ఛందంగా పనిచేశాను. అంతేకాదు.. పెద్దవాళ్లకంటే పిల్లలతో గడపడానికి ఎక్కువ ఇష్టపడతాను. అందుకే నిక్‌తో డేటింగ్ చేయడానికి ఆలోచించా’ అని చెప్పుకొచ్చింది. అయితే.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత సరోగసీ ద్వారా ప్రియాంక, నిక్ జంటకి మాల్తీ మేరీ అనే కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. (Priyanka Chopra about dating Nick Jonas)
కాగా.. ఇంతకుముందు మరో ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యం పుట్టడానికి తన అండాలను దాచానని చెప్పింది. గైనకాలజిస్ట్ అయిన తన తల్లే వాటి గురించి సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. అంతకుముందు తను బాలీవుడ్‌ని వదిలేయడానికి కారణం చెబుతూ.. కొంతమంత తనపై కక్ష్య గట్టి తనకు అవకాశాలు రాకుండా చేశారని ప్రియాంక తెలిపింది. (Priyanka Chopra did not want to date Nick Jonas)
ఇవి కూడా చదవండి:
Adipurush: శ్రీరామనవమి సందర్భంగా కొత్త పోస్టర్.. దీనికంటే ‘హను-మాన్’నే బావుందంటూ..
Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..
Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..
Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..
Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..
Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..
Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..