Preity Zinta: అతనే నన్ను వేధించాడు.. ఇలా జరిగితే మిస్ కాల్ ఇవ్వమంటూ..
ABN, First Publish Date - 2023-04-09T13:10:59+05:30
సినీ సెలబ్రిటీలు కనిపిస్తే చాలు పలువురు పలు రకాలుగా వేధిస్తున్నారు. కొందరు సమయం సందర్భం చూడకుండా సెల్ఫీ కావాలని అడుగుతుంటే.. మరికొందరేమో డబ్బులు కావాలని విసిగిస్తూ ఉంటారు.
సినీ సెలబ్రిటీలు కనిపిస్తే చాలు పలువురు పలు రకాలుగా వేధిస్తున్నారు. కొందరు సమయం సందర్భం చూడకుండా సెల్ఫీ కావాలని అడుగుతుంటే.. మరికొందరేమో డబ్బులు కావాలని విసిగిస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రితీ జింటాకి అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ బిచ్చగాడు ఆమెని డబ్బులు ఇవ్వమంటూ తన కారు వెనుకబడి వేధించాడు. దీనికి సంబంధించి వీడియో తాజాగా వైరల్ కూడా అయ్యింది. దీంతో నటికి చాలా పొగరు అంటూ విమర్శిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. దీనిపై తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రితీ జింటా (Preity Zinta) స్పందించింది. అసలు జరిగిన విషయమంటూ ఓ సుదీర్ఘ పోస్ట్‌ని షేర్ చేసింది.
ప్రితీ జింటా షేర్ చేసిన పోస్ట్‌లో.. ‘ఈ వారంలో జరిగిన 2 సంఘటనలు నన్ను బాగా కదిలించాయి. అందులో ఒకటి నా కూతురు జియాకి సంబంధించింది. ఒక స్త్రీ తనని ఫోటో తీయడానికి ప్రయత్నించింది. దీంతో అలా చేయొద్దని ఎంతో మర్యాదగా చెప్పాను. దాంతో.. నా కుమార్తెను నా దగ్గర నుంచి లాక్కొన్ని తన నోటి పక్కన బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ మహిళ ఓ ఎలైట్ బిల్డింగ్‌లో నివసిస్తుంది. అక్కడి తోటలో నా పిల్లలు ఆడుకుంటూ ఉండగా.. ఆమె ఇలా చేసింది. నేను సెలబ్రిటీ కాకపోయి ఉంటే నే స్పందించే విధానం మారి ఉండేదేమో. కానీ, అక్కడ సీన్ చేయకూడదనుకోవడంతో నన్ను నియంత్రించుకున్నాను’ అని రాసుకొచ్చింది. (Preity Zinta faces harassment)
ప్రితీ దాన్ని కొనసాగిస్తూ.. ‘ఇక 2వ సంఘటన విషయానికి వస్తే.. నేను అర్జంట్‌గా ప్లైట్ అందుకోవాల్సి ఉంది. ఆ సమయంలోనే ఓ వికలాంగుడు నన్ను ఆపడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి కొన్నేళ్లుగా నన్ను డబ్బు కోసం వేధిస్తున్నాడు. నా దగ్గర ఉన్నప్పుడల్లా అతనికి మనీ ఇచ్చాను. ఈ సారి అతను డబ్బు అడిగినప్పుడు ఈ రోజు నా దగ్గర మనీ లేదు. కేవలం క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉందని చెప్పాను. దానికి క్షమించమని కూడా అడిగాను. దాంతో నా పక్కన ఉన్న మహిళ అతనికి కొంత డబ్బు ఇచ్చింది. అది సరిపోకపోవడంతో అతను దానిని తిరిగి ఆమె వద్దకు విసిరేశాడు. కోపంగా అరవడం ప్రారంభించాడు. మీరు చూస్తున్న వీడియోలో అతను కొంత దూరం మమ్మల్ని వెంబడించడం, వేధించడం చూసే ఉంటారు’ ఉంటారు.
Also Read: Nayanthara: తన పిల్లల పూర్తి పేర్లు చెప్పేసిన నయన్.. ఇవేం పేర్లంటూ..
ఆ సంఘటనని ఇంక వివరిస్తూ.. ‘ఫోటోగ్రాఫర్‌లకు మాత్రం ఈ సంఘటన తమాషాగా అనిపించింది. మాకు సహాయం చేయడానికి బదులుగా వారు నవ్వుకుంటూ షూట్ చేశారు. కారుని అనుసరించవద్దని, మమ్మల్ని వేధించవద్దని ఎవరూ అతనికి చెప్పలేదు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే, నాపై నిందలు వేసేవారు. నేను సెలబ్రిటీని అని, బాధ్యత లేదా అని ప్రశ్నించేవారు. బాలీవుడ్‌పై విమర్శలు చేసేవారు. అయితే.. నేను మొదట మనిషినని, ఆ తర్వాత తల్లిని, ఆ తర్వాత సెలబ్రిటీని అని ప్రజలు గుర్తించే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. నా విజయానికి నేను నిరంతరం క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. దాని కోసం బెదిరింపులకు గురికావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఉన్న స్థితికి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. కోరుకున్న విధంగా జీవించడానికి ఈ దేశంలో అందరిలాగే నాకూ హక్కు ఉంది. కాబట్టి దయచేసి మీ ఆలోచన విధాన్ని మార్చుకోండి. అలాగే ప్రతిదానికీ ప్రముఖులను నిందించడం ఆపండి. ప్రతి నాణేనికి రెండు వైపులు ఉంటాయి. అలాగే.. నా పిల్లలను వదిలేయండి. వారిని ఫొటోలు తీయడానికి ప్రయత్నించకండి. మీడియా కూడా మమ్మల్ని వీడియోలు తీయడం కాకుండా ఇలాంటి జరుగుతున్నప్పుడు బాధ్యతగా వ్యవహరించండి’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.
ప్రితీ వైరల్ పోస్ట్‌పై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. ‘మంచి పని చేశావ్ ప్రీతి’ అని హృతిక్ రోషన్ (Hrithik Roshan), ‘ఇంకోసారి అలా జరిగితే నాకు మీస్ కాల్ ఇవ్వు.. చూసుకుందాం’ అని అర్జున్ రాంపాల్, ‘సరిగ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలా చెప్పావు’ అంటూ మలైకా అరోరా (Malaika Arora) కామెంట్ చేయగా.. ప్రియాంక చోప్రా (Priyanka Chopra) చప్పట్ల ఎమోజీలను కామెంట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
Adipurush: మరో వివాదంలో ప్రభాస్ మూవీ.. తన ఆర్ట్ వర్క్‌ని దొంగిలించారంటూ..
Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..
Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..