Boycott Pathaan: వారు షారుఖ్‌ని కావాలనే టార్గెట్ చేశారంటున్న దర్శకుడు
ABN, First Publish Date - 2023-02-01T10:57:29+05:30
దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తోంది.
దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తోంది. అయితే ఈ మూవీ విడుదలకి ముందు బాయ్‌కాట్ పఠాన్ (Boycott Pathaan) చేయాలంటూ ట్రెండ్ అయ్యింది. దీంతో సినిమాపై ప్రభావం పడుతుందేమోనని చిత్రబృందం భయపడింది. కానీ రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చి మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ విషయంపై తాజాగా ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) స్పందించాడు.
సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి కొందరు పఠాన్‌ను బహిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ ప్రేక్షకులు మాత్రం మద్దతుగా నిలిచారు. అయితే ఎవరైనా బహిష్కరణ గురించి మాట్లాడాలంటే.. వారు మాట్లాడే విషయంలో చాలా డెప్త్ ఉండాలని నేను భావిస్తున్నాను. అవి నిజమైతే రుజువులు ఉండాలి.
అయితే.. ‘పఠాన్’ విషయంలో వారు హాస్యాస్పదంగా ప్రవర్తించారు. వారికి ప్రేక్షకులు సరైన రీతిలో బుద్ది చెప్పారు. కానీ ఓ విషయం.. ఇటీవలి కాలంలో చాలామందికి టార్గెట్ అయినా షారుఖ్‌కు ఆడియన్స్ నుంచి మంచి మద్దతు వచ్చింది. అందుకే ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. చాలామందిని సినిమాని చూడటానికి ఇష్టపడ్డారు. కానీ దాన్ని జడ్జ్ చేయలేదు’ అని చెప్పుకొచ్చాడు.