Parineeti Chopra : ఫ్యాన్ పేజీలపై పరిణీతి ఫైర్..
ABN, First Publish Date - 2023-11-26T13:43:58+05:30
ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. వృత్తి పరంగా బిజీగా గడుపుతూనే కుదిరిన సమయంలో భర్తతో కలిసి షికార్లు చేస్తోంది. అయితే నెటిజన్ల చేష్టలకు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra). వృత్తి పరంగా బిజీగా గడుపుతూనే కుదిరిన సమయంలో భర్తతో కలిసి షికార్లు చేస్తోంది. అయితే నెటిజన్ల చేష్టలకు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి కొందరు తన పేరును ఉపయోగిస్తున్నారని ఆఎ అసహనం వ్యక్తం చేశారు. "నా పేరు ఉపయోగించి కొన్ని ఫ్యాన్ పేజీలు (Fire on Fan pages) తమ అభిమాన నటీనటులకు ఫేవర్‌గా పోస్ట్‌లు క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల అవి నా దృష్టికి వచ్చాయి. అయితే ఈ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఏ ఒక్కరినీ ప్రశంసించడానికి లేదా అభినందించడానికి నేను ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇలాంటివి పునరావృతం అయితే రిపోర్ట్ చేస్తా. ఎవరి గురించి అయినా ఓ పోస్ట్ చేసే ముందు నిజానిజాలు తెలుసుకోండి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు.’’ అని తెలిపారు. (Parineeti Chopra warning)
అయితే పరిణీతి ఇలా రియాక్ట్ కావడానికి కారణం ఏంటి ? అన్నది చెప్పలేదు. తన స్నేహితుడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఎంపీ రాఘవ్ చద్దాను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే!