Pallavi Joshi: షూటింగ్‌లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నటికి ప్రమాదం
ABN, First Publish Date - 2023-01-17T15:00:19+05:30
గతేడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం అందుకున్న చిత్రం వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’.
గతేడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం అందుకున్న చిత్రం వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రంలో ప్రొఫెసర్‌గా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి పల్లవి జోషీ (Pallavi Joshi). ఈ నటి ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలోనే ‘ది వ్యాక్సిన్ వార్’ (The Vaccine War) అనే చిత్రం చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ తరుణంలోనే నటికి యాక్సిడెంట్ అయ్యింది.
ప్రస్తుతం షెడ్యూల్‌లో కార్ ఛేజింగ్ సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ వాహనం అదుపుతప్పి పల్లవిని ఢికొట్టడంతో ఆమెకి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని సమీప ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకున్నారు. అనంతరం యథావిధిగా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
కాగా.. మహమ్మారి మధ్య కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడానికి భారతదేశం చేసిన ప్రయాణంపై ఆధారపడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పల్లవితో పాటు అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, నానా పటేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ 2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొత్తం 11 భాషల్లో విడుదల కానుంది.