సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sri Devi 2.0: పల్లెటూరి యువతిలా మారిపోయిన జాన్వీ.. చూపు తిప్పుకోలేకపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

ABN, First Publish Date - 2023-03-09T10:16:24+05:30

బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Janhvi Kapoor
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందాల తార, శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందింది. వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. త్వరలో టాలీవుడ్‌కి కూడా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబో మూవీ ‘ఎన్టీఆర్ 30’ (NTR 30)లో హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వచ్చింది.

అయితే, సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. కాగా.. ఈ బ్యూటీ తాజాగా పల్లెటూరి అమ్మాయి (Village Girl)లా మారిపోయింది. దీనికి సంబంధించిన పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో.. బ్లాక్ అండ్ వైట్‌గా ఉన్న ఫొటోల్లో జాకెట్టు లేకుండా చీరకట్టుతో ఆకట్టుకుంటోంది. జడలో పువ్వులతో, కళ్లకి కాటుక పెట్టుకుని మైమరిపిస్తోంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ భామ అందానికి ఫిదా అయిపోయి వరుసగా కామెంట్స్ చేస్తున్నారు.

‘శ్రీదేవి 2.0 లా ఉన్నావు’.. ‘ఎన్టీఆర్ 30 కోసం ఫొటో షూట్ చేశావా’.. ‘ఎన్టీఆర్ 30 కోసం ఎదురుచూస్తున్నాం’.. ‘రెండో పిక్‌లో అయితే నటి స్మిత పాటిల్‌లా ఉన్నావు’.. అలాగే ఎన్టీఆర్ అభిమానులతో పాటు కొందరు సెలబ్రిటీలు సైతం ‘చూపు తిప్పుకోలేకపోతున్నాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే ‘మిలీ’ మూవీతో ప్రేక్షకులని అలరించిన జాన్వీ.. ప్రస్తుతం వరుణ్ ధావన్ సరసన ‘బవాల్’, రాజ్‌కుమార్ రావ్‌కి జంటగా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ అని చిత్రాల్లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి:

OTT Release: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..


Updated Date - 2023-03-09T10:33:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!