కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Salaar Vs Dunki: రెబల్‌ స్టార్‌తో పోటీకి తగ్గేదే లే అంటోన్న బాద్‌షా..

ABN, First Publish Date - 2023-10-14T12:01:19+05:30

రెబల్ స్టార్ ప్రభాస్‌తో పోటీకి సిద్ధమయ్యారు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. వీరిద్దరూ నటించిన సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలబడబోతున్నాయి. ప్రభాస్ నటించిన ‘సలార్’, షారుఖ్ నటించిన ‘డంకీ’ సినిమాలు డిసెంబర్ 22న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్నాయి. తాజాగా ‘డంకీ’ సినిమా వాయిదా పడిందనే వార్తలను.. ఆ చిత్ర మేకర్స్ ఖండించారు.

Prabhas and Shah Rukh Khan

రెబల్ స్టార్ ప్రభాస్‌తో పోటీకి సిద్ధమయ్యారు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). వీరిద్దరూ నటించిన సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలబడబోతున్నాయి. ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar), షారుఖ్ నటించిన ‘డంకీ’ (Dunki) సినిమాలు డిసెంబర్ 22న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు విడుదలకు, పోటీకి సంబంధించి ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరంగా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా షారుఖ్ నటించిన ‘డంకీ’ సినిమా వాయిదా అంటూ వార్తలు వినిపించిన నేపథ్యంలో అస్సలు తగ్గేదేలే అంటూ.. మేకర్స్ ఆ వార్తలను ఖండించడమే కాకుండా.. మరోసారి కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. (Salaar vs Dunki)

‘పఠాన్’ (Pathaan), ‘జవాన్’ (Jawan) వంటి రెండు వరుస హిట్స్‌తో ఉన్న షారుఖ్.. ఈ ‘డంకీ’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నారు. అందుకే ఎప్పుడో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. కానీ, అనూహ్యంగా ఇదే డేట్‌కి ‘సలార్’ కూడా యాడ్ అవడంతో.. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ‘సలార్’ ఏం సామాన్యమైన సినిమా కాదు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకుడు. ‘కెజియఫ్’‌తో బాక్సాఫీస్‌ని అల్లాడించిన ప్రశాంత్ నీల్, గ్లోబల్ రేంజ్ స్టార్‌గా మారిన ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు రాజ్‌కుమార్ హిరాణీ (Rajkumar Hirani) సినిమాలకు ఉండే అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. ఆయన నుంచి సినిమా వస్తుందీ అంటే.. ఆ సినిమాకు ఓ రేంజ్ ఉంటుంది. సో.. రెండూ నువ్వా? నేనా? అనేలాంటి సినిమాలే. అందుకే.. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల విడుదలపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి.


ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ‘సలార్’ ఈసారి ఖచ్చితంగా థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ అంటున్నారు. ‘డంకీ’ వాయిదా పడిందనే వార్తలను ఆ సినిమా మేకర్స్ ఖండించినట్లుగా తాజాగా బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్స్ సైతం కన్ఫర్మ్ చేశారు. ‘డంకీ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదు. డిసెంబర్‌ 22నే విడుదల అవుతుంది. డంకీ విడుదల తేదీపై వస్తున్న రూమర్స్‌ను నమ్మవద్దు’ అని మేకర్స్ చెప్పినట్లుగా తరుణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ చేశారు. అందులో పక్కాగా డిసెంబర్ 22నే ‘డంకీ’ విడుదల అంటూ క్లారిటీ ఇవ్వడంతో.. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ బాక్సాఫీస్ వద్ద తలపడటం తధ్యం. చూద్దాం.. ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో? (No Change in Dunki Release Date)


ఇవి కూడా చదవండి:

============================

*Salman Khan: ఆయుధం లేకుండానే.. ‘టైగర్’ వారి అంతు చూస్తాడు

***********************************

*Taapsee Pannu: ఇప్పటి వరకు కమర్షియల్ హీరోతో చేసే అవకాశం రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు

*************************************

*KCR: ‘కేసీఆర్’ పేరుతో సినిమా.. హీరో ఎవరంటే..

************************************

*UnstoppableWithNBK3 Promo: ఒకడు నాశనం చేస్తాడు.. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి రావాల్సిందే..

********************************

*University: ‘యూనివర్సిటీ’కి వస్తోన్న స్పందనతో పీపుల్ స్టార్ ఏమన్నారంటే..

*********************************

Updated Date - 2023-10-14T12:01:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!