కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nitin Desai death: ఆడియో టేప్‌ బయటకు.. భార్య కేసు నమోదు!

ABN, First Publish Date - 2023-08-04T19:01:29+05:30

ఉత్తమ కళా దర్శకుడిగా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్న బాలీవుడ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ )Nithin Desai) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుల భారంతోనే ఆయన మరణించారని టాక్‌ వినిపిస్తోంది. ఈ సూసైడ్‌ కేసును దర్యాప్తు చేస్తోన్న రాయ్‌గఢ్‌ పోలీసులు శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు.

ఉత్తమ కళా దర్శకుడిగా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్న బాలీవుడ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ )Nithin Desai) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుల భారంతోనే ఆయన మరణించారని టాక్‌ వినిపిస్తోంది. ఈ సూసైడ్‌ కేసును దర్యాప్తు చేస్తోన్న రాయ్‌గఢ్‌ పోలీసులు శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. నితిన్‌కు చెందిన ఎన్డీ ఆర్ట్స్‌ స్టూడియో నుంచి ఓ ఆడియో రికార్డర్‌ (Audio tape leak)స్వాదీనం చేసుకున్నారు. అందులో దాదాపు 15 ఆడియో క్లిప్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు. 20 నిమిషాల నిడివి గల ఆడియోలో నితిన్‌ తన ఆవేదన వ్యక్త పరిచారని చెప్పారు. ‘‘ఇప్పటికే ఎంతో దూరం వచ్చా. ఇక, నడిచే ఓపిక నాకు లేదు’’ అని ఆ ఆడియోలో తెలిపారు. ఫైనాన్స్‌ సంస్థ విధానాల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయానని, వాటి నుంచి బయటపడటం చాలా కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు. తాను ఫైనాన్స్‌ తీసుకున్న సంస్థలోని నలుగురు వ్యక్తుల గురించి నితిన్‌ ఎక్కువగా మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఆ నలుగురు వ్యక్తులను విచారిస్తామని పోలీసులు చెప్పారు. మరికొన్ని ఆడియోల్లో తన లైఫ్‌స్టోరీ గురించి చెప్పారని పోలీసులు తెలిపారు. (Nithin Desai suicide)


అయితే బాలీవుడ్‌ మీడియా, పోలీసులు చెబుతున్న ప్రకారం.. నితిన్‌కు దాదాపు రూ.252 కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎఫ్‌ఎం అనే ఫైనాన్స్‌ సంస్థ నుంచి 2016-18 సంవత్సరాల్లో రెండు దఫాలుగా రూ.180 కోట్లను ఆయన అప్పు తీసుకున్నారు. ఈ అప్పు కోసం 42 ఎకరాల స్థలాన్ని, ఇతర ఆస్తులను ఆయన తనఖా పెట్టారు. అప్పు చెల్లించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఆ ఫైనాన్స్‌ సంస్థ నితిన్‌ నుంచి డబ్బు వసూలు చేసే బాఽధ్యతను ఎడెల్విస్‌ ఎసెట్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ అనే సంస్థకు అప్పగించింది. ఎడెల్విస్‌ సంస్థ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. వాదోపవాదాలు విన్న కోర్టు అప్పు రికవరీ ప్రక్రియకు అంగీకరించింది. ఇవన్నీ తట్టుకోలేని తరుణంలో ఒత్తిడితో నితిన్‌ ఈ నెల 2న తన స్టూడియోలో సూసైడ్‌ చేసుకున్నారు.

ఫైనాన్స్‌ కంపెనీపై కేసు...

దీనిపై నితిన్‌ భార్య ఈసీఎల్‌ సంస్థ అధికారులు, ఇతర ఉద్యోగులు కలిపి మొత్తం ఐదుమందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్‌ 306, ఐపీసీ 34 ప్రకారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేశారు. (Case File)

Updated Date - 2023-08-04T19:01:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!