Boney Kapoor: మోడల్‌పై అక్కడ చెయ్యేశాడు.. నెటిజన్లు ఆడేసుకుంటున్నారు!
ABN, First Publish Date - 2023-04-04T19:03:23+05:30
సినీ సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనమే! మంచి చేస్తే అభిమానులు, నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తారు. తేడా వస్తే అంతకుమించి ఏకిపారేస్తారు. అంతగా సెలబ్రిటీలను గమనిస్తుంటారు.
సినీ సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనమే! మంచి చేస్తే అభిమానులు, నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తారు. తేడా వస్తే అంతకుమించి ఏకిపారేస్తారు. అంతగా సెలబ్రిటీలను గమనిస్తుంటారు. ట్రోలింగ్ చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌కు (Boney kapoor) ఎదురైంది. దీంతో నెటిజన్లు విపరీతంగా ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో హాలీవుడ్‌కు చెందిన మోడల్ నడుమపై చెయ్యి వేశారంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. (Trolling on Boney kapoor) (Gigi Hadid)
ఇటీవల నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా హాజరయ్యాడు. అదే కార్యక్రమానికి హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మోడల్ జిగీ హడిద్ (Gigi Hadid) కూడా హాజరయ్యారు. వేదికపై బోనీ కపూర్ (Boney kapoor) కనిపించడంతో ఆమె ఆయన్ను పలకరించింది. తదుపరి ఇద్దరూ ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ఫోటో దిగే క్రమంలో బోనీ కపూర్ జిగీ హడిద్ నడుముపై చేతులు వేశారు. జిగీ సైతం దాన్ని లైట్ తీసుకుంది. ఆ ఫొటో క్యాజువల్‌గానే ఉన్నా.. నెటిజన్స్ మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను షేర్ చేసి బోనీ కపూర్‌ను విమర్శిస్తున్నారు. ‘బోనీ నిజంగానే ఆమె సన్నని నడుమపై చేయి వేశాడా? లేదా నేను భ్రమలో ఉన్నానా’ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.