Nawazuddin Siddiqui: భార్యపై ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటుడు.. నా నుంచి మరింత డబ్బులు గుంజడానికే ప్రయత్నాలు..
ABN, First Publish Date - 2023-03-06T15:44:06+05:30
విభిన్న సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). ‘రమణ్ రాఘవ్ 2.0’, ‘బజరంగీ భాయిజాన్’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. నవాజుద్దీన్‌కు భార్య ఆలియా (Aaliya)తో కొంత కాలంగా పొసగడం లేదు.
విభిన్న సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). ‘రమణ్ రాఘవ్ 2.0’, ‘బజరంగీ భాయిజాన్’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. నవాజుద్దీన్‌కు భార్య ఆలియా (Aaliya)తో కొంత కాలంగా పొసగడం లేదు. అభిప్రాయ భేదాల వల్ల ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నవాజుద్దీన్‌పై ఆలియా పలు ఆరోపణలు గుప్పించింది. తనను రేప్ చేయడానికి నవాజుద్దీన్ ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలపై నవాజుద్దీన్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. తాజాగా ఈ నటుడు ఓ ప్రకటనను విడుదల చేశాడు. ఆలియా తన నుంచి మరిన్ని డబ్బులు గుంచడానికి ప్రయత్నిస్తుందని నవాజుద్దీన్ ఆరోపించాడు.
నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రస్తుతం జరుగుతున్న ఘటనలన్నింటిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నేను స్పందించకపోవడంలో ప్రతి ఒక్కరు నన్ను చెడ్డవాడిగా చూస్తున్నారు. ఈ తమాషానంతా నా పిల్లలు ఏదో ఒక దగ్గర చదువుతారని నేను పెదవి విప్పలేదు. మొదటగా మీకు చెప్పాల్సిన విషయమేమిటంటే నేను, ఆలియా కొన్నేళ్లుగా కలసి ఉండటం లేదు. విడాకులు కూడా తీసుకున్నాం. కానీ, మా పిల్లల విషయంలో మాత్రం ఏం చేయాలో ఇద్దరికి క్లారిటీ ఉంది. మా పిల్లలు భారత్‌లో ఎందుకు ఉన్నారో ఎవరికైనా తెలుసా..? 45రోజులుగా వారు పాఠశాలకు వెళ్లడం లేదు. చాలా రోజుల నుంచి స్కూల్‌కు వెళ్లకపోవడంతో వారు నాకు లెటర్స్ పంపిస్తున్నారు. నా పిల్లలు పాఠశాలను మిస్ అవుతూ 45రోజులుగా బందీలుగా ఉన్నారు. ఆలియా దుబాయ్ నుంచి పిల్లలను తీసుకువచ్చింది. మరిన్ని డబ్బులను డిమాండ్ చేస్తుంది. రెండేళ్లుగా ఆమెకు నెలకు రూ.10లక్షలు చెల్లిస్తున్నాను. పిల్లలను దుబాయ్‌కు తీసుకువెళ్లడానికి ముందు నెలకు రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఇచ్చేవాడిని. ఆమెకు ఆదాయ మార్గం చూపించాలని మూడు సినిమాలకు ఫైనాన్స్ చేశాను. కోట్లాది రూపాయాల ఖర్చును భరించాను. నేను ఇచ్చిన డబ్బుతో పిల్లలకు విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసింది. అనంతరం వాటిని అమ్మేసి తన అవసరాలకు వినియోగించుకుంది. నా పిల్లల కోసం ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొన్నాను. దుబాయ్‌లో కూడా ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాను. ఆమె జీవితం సాఫీగా సాగిపోయేలా చూశాను’’ అని నవాజుద్దీన్ సిద్దిఖీ తెలిపాడు.
‘‘నా నుంచి మరింత డబ్బును ఆమె గుంజాలనుకుంటుంది. అందువల్ల నా మీద, నా తల్లి మీద అనేక కేసులను వేసింది. ఆమె గతంలో కూడా ఈ విధంగా చేసి కేసులను విత్ డ్రా చేసుకుంది. పిల్లలు ఇండియాలో ఉండటంతో అమ్మమ్మతో సమయం గడపాలని నేను అనుకున్నాను. నా పిల్లలను ఏ విధంగా బయటికి నెట్టేస్తాను..? ఆ సమయంలో నేను ఇంటిలో కూడా లేను. ఈ డ్రామాలోకి పిల్లలను ఆమె లాగాలనుకుంటుంది. ఈ భూమ్మీద ఉన్న తల్లిదండ్రులెవరైనా పిల్లల స్కూల్ మిస్ అవ్వకూడదనుకుంటారు. నేను సంపాదించేదంతా నా పిల్లల కోసమే. వారి భవిష్యత్తును కాపాడటానికి నేను ఎంతవరకైనా వెళతాను’’ అని నవాజుద్దీన్ సిద్దిఖీ పేర్కొన్నాడు.
^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్ ఛాన్స్ ఎవరికంటే..?
Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు
Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్