సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manoj Bajpayee: ‘తను ముస్లిం.. నేను హిందువు.. అంతే..’

ABN, First Publish Date - 2023-04-05T18:19:44+05:30

ఇటీవలికాలంలో ఎక్కువగా వినిపిస్తున్న బాలీవుడ్ నటుడు పేరు ఏదంటే.. ఎవరైనా టక్కున మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee) అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు.

Manoj Bajpayee on Religion
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలికాలంలో ఎక్కువగా వినిపిస్తున్న బాలీవుడ్ నటుడు పేరు ఏదంటే.. ఎవరైనా టక్కున మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee) అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. కరోనా వల్ల సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే.. ఈ నటుడికి మాత్రం ఆ సమయం విపరీతంగా కలిసొచ్చింది. ఆ సమయంలోనే ‘ఫ్యామిలీ మ్యాన్’ (Family Man) అనే సూపర్ హిట్ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రలో నటించాడు. క్రేజీ దర్శక ద్వయం రాజ్, డీకే (Raj & DK) డైరెక్షన్ చేసిన ఈ వెబ్‌సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళం వంటి పలు ప్రాంతీయ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. అనంతరం రెండో సీజన్ కూడా విడుదలై అది కూడా సూపర్ హిట్‌గానే నిలిచింది. అలాగే.. వెబ్‌సిరీస్‌లు చేస్తూనే, మరోవైపు వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.

అయితే.. మనోజ్ కొన్నేళ్ల క్రితం షబానా రజా (Shabana Raza) అనే ముస్లిం (Muslim) మహిళని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ పెళ్లి తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. అయితే, మనోజ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ‘మీ భార్య ముస్లి.. మీరు హిందువు. మతాలు వేరు కావడం వల్ల ఏం గొడవలు జరగడం లేదా?’ అని హోస్ట్ అడిగాడు. దానికి సమాధానం మనోజ్ మాట్లాడుతూ.. ‘షబానాతో నా వివాహం మతం కంటే విలువలకు సంబంధించినది. భవిష్యత్తులో ఎవరైనా తమ విలువలను మార్చుకున్నా, వారి వివాహం బంధం ఎక్కువ కాలం కొనసాగదు. నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడిని. ఆమె కూడా పేరున్న ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా మా వివాహానికి ఏది అడ్డు రాలేదు. నా భార్యకు ప్రత్యేకించి మతం లేదు. కాని, ఆమెకి చాలా స్పిరిచ్యువల్. ఆమె ముస్లింగా గర్విస్తుంది. నేను హిందువుగా గర్విస్తాను. కానీ ఒకరితో ఒకరం ఘర్షణ పడం’ అని చెప్పాడు. (Manoj Bajpayee about wife Shabana religion)

అలాగే.. మనోజ్ ఇంకా మాట్లాడుతూ.. ‘చాలా మంది నా భార్య మతం గురించి మాట్లాడతారు. అయితే.. ఎవరికీ నాతో డైరెక్ట్‌గా మాట్లాడే ధైర్యం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఎవరైనా నాతో అలా మాట్లాడితే నేను స్పందించే విధానం వేరే విధంగా ఉంటుందని వారికి తెలుసు. అందుకే చాలామంది ఇప్పటికీ నా కోపం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. మనోజ్ ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇవి కూడా చదవండి:

Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..

Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?

Shilpa Shetty: పబ్లిక్‌లో హాలీవుడ్ నటుడితో ముద్దు.. 15 ఏళ్ల క్రితం కేసులో నటికి రిలీఫ్

RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడుగా..

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-05T18:19:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!