కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mannara Chopra : హిందీ బిగ్‌బాస్‌లో క్లారిటీ ఇచ్చింది.!

ABN, First Publish Date - 2023-10-17T11:28:09+05:30

ఇటీవల దర్శకుడు ఎస్‌.రవికుమార్‌ చౌదరి (AS Ravikumar Chowdary) హీరోయిన్ మన్నారా చోప్రాను Mannara chopra) వేదికపై ముద్దు పెట్టుకున్న సంగతి ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! దానిపై దర్శకుడు అప్పుడే  క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవల దర్శకుడు ఎస్‌.రవికుమార్‌ చౌదరి (AS Ravikumar Chowdary) హీరోయిన్ మన్నారా చోప్రాను Mannara chopra) వేదికపై ముద్దు పెట్టుకున్న సంగతి ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! దానిపై దర్శకుడు అప్పుడే  క్లారిటీ ఇచ్చాడు. 'అది వేరే ఉద్దేశంతో పెట్టిన ముద్దు (kiss) కాదని, అయినా ఆమెకు లేని నొప్పిన మీకెందుకు’ అంటూ స్పందించిన సంగతి విదితమే! ఇదే విషయంపై తాజాగా హీరోయిన మన్నారా చోప్రా స్పందించారు. తాజాగా హిందీ ‘బిగ్‌బాస్‌ 17’లో ఈమె కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ేస్టజీపైకి ఆహ్వానం పలికిన సల్మాన్ ఖాన్ ఆ ముద్దు గురించి అడిగాడు. దీనికి బదులిచ్చిన మన్నారా.. అది మీరనుకునే ముద్దు కాదని, ప్రేమపూర్వకంగా ఆయన తనకు పెక్‌ తరహా ముద్దు పెట్టారని చెప్పింది. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని వివరించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అంతే కాదు.. మళ్లీ ఆ ముద్దు వీడియోలో నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి.

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రాకు బంధువైన మన్నార ‘ప్రేమ గీమా జాన్తా నై’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత జక్కన్న, తిక్క, రోగ్‌, సీత వంటి చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో ఏ చిత్రమూ ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా రాజ్ తరుణ్తో ‘తిరగబడరా సామి’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఎ.ఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ వేడుకలోనే దర్శకుడు ఈమెను ముద్దాడాడు.

Updated Date - 2023-10-17T11:28:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!