Malaika Arora - Arjun Kapoor: ఇద్దరూ విడిపోయినట్టేనా, అర్జున్ వేరే అమ్మాయిని చూసుకున్నాడా...
ABN, First Publish Date - 2023-08-26T15:20:53+05:30
బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోతున్నారు అన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. మలైకా తన సాంఘీక మాధ్యమంలో పెట్టిన పోస్టులు, అలాగే అర్జున్ కపూర్ ఇంకో అమ్మాయితో వున్నాడు అనే వార్త కూడా బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ జన కలిసున్నారా, విడిపోయారా...
బాలీవుడ్ లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే మలైకా అరోరా (MalikaAroraKhan), అర్జున్ కపూర్ (ArjunKapoor) జంట గురించే. వీళ్ళిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా కలిసి వుంటున్నారు, కానీ ఈమధ్య వీళ్ళిద్దరూ విడిపోయారు అనే వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ ఎన్నో ఏళ్లుగా కలిసున్నా, 2019 లో వీళ్ళిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆలా అప్పటి నుండి ఇద్దరూ కలిసే వున్నారు. అయితే ఈమధ్య వీళ్లిద్దరి మధ్య ఎదో చిన్న గొడవలు మొదలయ్యాయని అందువల్ల ఇద్దరూ విడిపోతున్నారని ఒక వార్త బయలుదేరింది.
అయితే ఇన్ని వార్తలు వస్తున్నా, ఇద్దరూ వీటి గురించి ఖండించడం కానీ, లేదా ఆ వార్త నిజమే అని కానీ చెప్పలేదు. దానికి తోడు మలైకా అరోరా తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులు కూడా ఈ వార్తలను బలపరిచేవిగా ఉన్నాయని అంటున్నారు. అందుకని ఇప్పుడు ఈ జంట గురించిన వార్త చాలా హాట్ టాపిక్ గా తయారయింది.
అలాగే మలైకాతో విడిపోయిన అర్జున్ కపూర్ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కుషా కపిలాతో (KushaKapila) డేటింగ్ చేస్తున్నాడని కూడా వార్తలు రావడంతో ఈ పుకార్లు మరింత వ్యాప్తి చెందాయి. శనివారం ఉదయం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మలైకా అరోరా ఒక పోస్ట్‌ను పెట్టింది, అందులో, “మార్పు అనేది జీవిత చట్టం. గతం లేదా వర్తమానం వైపు మాత్రమే చూసేవారు భవిష్యత్తును కోల్పోతారు" అనే అర్థం వచ్చేట్టు పెట్టింది. అలాగే నిన్న రాత్రి కూడా అలంటి అర్థం వచ్చేటట్టు గా ఇంకో పోస్ట్ పెట్టింది. అందులో, బలంగా ఉండండి, నిర్భయంగా ఉండండి, అందంగా ఉండండి. మీకు మద్దతిచ్చే సరైన వ్యక్తులు పక్కన ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని నమ్మండి, అని చెప్పింది.
మలైకా అరోరా ఇంతకు ముందే అర్జున్ కపూర్ చెల్లెళ్ళు అన్షులా, ఖుషి, (KhushiKapoor) జాన్వీ కపూర్లను (JanhviKapoor) సాంఘీక మాధ్యమంలో అన్‌ఫాలో చేసినట్లు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. వీటికి తోడు అర్జున్ కపూర్ కుశ కపిల అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నారనే వార్తలకి తెర లేపడంతో సాంఘీక మాధ్యమాల్లో కూడా వీరిద్దరి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అదీ కాకుండా కుషా కపిల ఈమధ్యనే తన భర్త జోరవర్ అహ్లువాలియా (ZorawarAhluwalia) నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. వీటికి తోడు కొన్ని రోజుల క్రితం మలైకా అరోరా ఒక టాప్ వేసుకొని ఒక షాప్ కి వెళ్ళినప్పుడు, ఆమె టాప్ మీద 'విడిపోదాం' అనే అర్థం ధ్వనించేటట్టు వచ్చే కెప్షన్ ఉండటం ఈ ఇద్దరూ విడిపోతున్నారని సంకేతాలు పంపిస్తున్నారని అంటున్నారు.
అర్జున్ కపూర్, మలైకా అరోరా ఇప్పుడైనా ఇలా విడిపోయారు అనే వస్తున్న వార్తల మీద ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.