Malaika Arora and Arjun Kapoor: బ్రేక్ అప్ అయ్యారు అన్న వార్తల నేపథ్యంలో ఈ ఇద్దరూ...
ABN, First Publish Date - 2023-08-28T15:57:29+05:30
మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోతున్నారు అన్న వార్త నిన్నటి ఉదయం వరకు సాంఘీక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి గురించి ఇంకొక వార్త వైరల్ అవుతోంది, అదేంటి అంటే...
బాలీవుడ్ లో ఇప్పుడు ఈ జంట గురించే ఎక్కడ చూసినా టాపిక్ నడుస్తోంది. మలైకా అరోరా (MalikaArora), అర్జున్ కపూర్ (ArjunKapoor) విడిపోయారు అన్న వార్తలు నిన్నటి వరకు సాంఘీక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మలైకా, అర్జున కపూర్ చెల్లెలు జాన్వీ కపూర్ (JanhviKapoor) ను సాంఘీక మాధ్యమంలో అన్ ఫాలో చెయ్యడం, అలాగే వీళ్ళిద్దరూ ఈమధ్య ఒకరికొకరు మాట్లాడుకోకపోవటం, అర్జున్ కపూర్ ఇంకో అమ్మాయి కుషా కపిల (KushaKapila) అనే అమ్మాయితో తిరుగుతున్నాడు అనీ వార్తలు రావటం వలన వీళ్ళిద్దరూ విడిపోయారు అనే వాత వైరల్ అయింది.
ఇదిలా ఉండగా, నిన్న ఆదివారం మలైకా అరోరా, అర్జున్ కపూర్ లు ఇద్దరూ కలిసి లంచ్ కి బయటకి వచ్చారు. ఆ తరువాత ఇద్దరూ రెస్టారెంట్ నుండి బయటకి రావటం ఎవరో అది వీడియో తీసి సాంఘీక మాధ్యమంలో పోస్ట్ చెయ్యడం, అలా వీళ్ళిద్దరూ కలిసి వున్న వీడియో చూసాక వీళ్ళిద్దరూ ఇంకా కలిసే వున్నారు, విడిపోలేదు అని ఇంకో వార్త ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.
మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఇద్దరివీ గాగుల్స్ (goggles) మలైకా టేబుల్ మీద పెట్టి ఒక ఫోటో తన సాంఘీక మాధ్యమంలో షేర్ చేసింది కూడా. మరి కొన్ని రోజుల క్రితం వరకు ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమైనా సయోధ్య కుదిరిందా, ఎందుకు మరి ఈ ఇద్దరూ వాళ్ళ మీద విడిపోయారు అని వార్తలు వచ్చినప్పుడు స్పందించలేదు అని బాలీవుడ్ లో గుస గుస లాడుకుంటున్నట్టుగా భోగట్టా.
ఇప్పుడు ఈ ఇద్దరూ ఆదివారం బయటకి కలిసి రావంతో ఈ ఇద్దరూ విడిపోయారు అని వార్తలకి కొన్ని రోజులు ఇక ఆగిపోతాయి అని అనుకుంటున్నారు. అయితే మలైకా మరి అర్జున్ కపూర్ కుటుంబ సభ్యులైన అతని చెల్లెళ్ళను సాంఘీక మాధ్యమంలో ఎందుకు అన్ ఫాలో అయిందో కూడా తెలియటం లేదు అని అంటున్నారు.