సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ranbir Kapoor: హీరో టీ షర్ట్‌ను లాగి లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం.. వైరల్‌గా మారిన వీడియో..

ABN, First Publish Date - 2023-03-05T19:03:40+05:30

బాలీవుడ్ స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. తాజాగా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkaar) లో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ ప్రమోషన్స్ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. తాజాగా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkaar) లో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ముంబై‌లో ఓ ఈవెంట్‌కు హాజరు కాగా హీరోకు అనుకోని అనుభవం ఎదురైంది. ఓ లేడీ ఫ్యాన్ ఒకరు రణ్‌బీర్‌ను లాగేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముంబైలో రణ్‌బీర్ కపూర్ సినిమా ప్రమోషన్స్‌కు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. లేడీ ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. రణ్‌బీర్ కూడా అందరి కోరికను మన్నిస్తూ సెల్ఫీలు ఇచ్చారు. అయినప్పటికీ, ఓ అభిమాని మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. హీరో చేతులు, ముఖాన్ని తాకడానికి ప్రయత్నించారు. రణ్‌బీర్ బయటికి వెళ్లిపోతుండగా ఓ లేడీ ఫ్యాన్ టీ షర్ట్‌ను లాగారు. ‘ఐ లవ్ యూ అని అరవడం మొదలుపెట్టారు. అనంతరం ఆ పిక్‌ను చూసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్స్ విపరీతంగా షేర్ చేయడం మొదలుపెట్టారు. కానీ, కొంత మంది నెటిజన్స్ మాత్రం ఇది వేధింపుల కిందకు వస్తుందన్నారు.

‘తూ ఝూఠీ మై మక్కర్’ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందింది. శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) హీరోయిన్ గా నటించారు. టీ సిరీస్ ఫిలిమ్స్, లవ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఈ మూవీ హోలి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-05T19:05:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!